Asianet News TeluguAsianet News Telugu

ఉగాది ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుంది..!

Ugadi 2023: ఉగాదికి ఇంకా ఒక్క రోజే గ్యాప్ ఉంది. అయితే ఈ ఏడాది ఉగాది కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

ugadi 2023: 4 zodiac signs will get many benefits and gain in business before ugadi
Author
First Published Mar 20, 2023, 4:33 PM IST

Ugadi 2023: ప్రతి ఏడాది ఉగాది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తుంది. ఈ ఏడాది ఉగాది ఈ నెల 22 న వచ్చింది. ఈ పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాలకు కొత్త సంవత్సరం కాబట్టి. అయితే ఉగాది నుంచే చైత్ర నవరాత్రులు కూడా మొదలవుతాయి. అయితే ఈ ఉగాది కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

జ్యోతిష్యం ప్రకారం.. కొత్త సంవత్సరం అన్ని రాశులపై ఏదో ఒక విధంగా ప్రభావం అయితే చూపుతుంది. దీనివల్ల వీరి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అసలు ఈ ఉగాది ఏయే రాశులకు మంచి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ధనస్సు

ఉగాది ధనస్సు రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్యం ప్రకారం.. ఈ రాశివారికి ఈ ఉగాది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు బిజినెస్ లో మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. ఉగాది రోజున మీరు ఫ్రెండ్స్ తో ఆనందంగా గడుపుతారు. అంతేకాదు ఈ ఉగాదికి జాబ్ ఆఫర్లను కూడా పొందొచ్చు. 

తులరాశి

జోతిష్యం ప్రకారం.. ఈ రాశి వారికి ఉగాదితో మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇన్నాళ్లుగా ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా మాయం అవుతాయి. ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. శత్రువుల భయం పోతుంది. విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. 

సింహ రాశి

చైత్ర శుక్ల మాసం సింహ రాశివారికి మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ రాశివారు వారసత్వ ఆస్తులను పొంచే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాదు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల నుంచి సహాయం పొందుతారు. అంతేకాదు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. 

మిథునం

ఈ కొత్త సంవత్సరం మిథునరాశి వారికి శుభప్రధంగా ఉండబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది వీరికి అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారి జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. ఈ రాశివారు ఉగాది తర్వాత జాబ్ ఆఫర్లను పొంతే అవకాశం ఉంది. అలాగే మంచి విజయాలను సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఇన్నాళ్లుగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.     
 

Follow Us:
Download App:
  • android
  • ios