డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆదాయం - 14 ,  వ్యయం - 2              రాజపూజ్యం - 2 ,  అవమానం - 7

•  ఏకాదశంలో ఉన్న రాహువు, పంచమంలో ఉన్న కేతువు, షష్టమంలో ఉన్న శని ఉన్న కారణం చేత 

• సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది.

• గత 14 సంవత్సరాల నుండి మీరు పడుతున్న వ్యయ ప్రయాసలు, బాధలు తొలగిపోతాయి.

• స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

• విద్యార్ధులు పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు.

•  పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగా సాగుతుంది. 

•  మాటపట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు.

•  రూపాయి ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి, సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. 

• వారసత్వంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి.

•  విదేశీయాన ఖర్చులకు ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు చేస్తారు.

• సంతానం, కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. 

• ఆరోగ్యవృద్ధికి కూడా ధనం ఖర్చవుతుంది. వీటన్నింటినీ భరించడానికి కావలసిన ధనం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావడం విశేషం. 

•  కొన్ని సందర్భాలలో మీరు చేస్తున్నది మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది.

• విద్య వైజ్ఞానిక రంగాలలో అనుకున్నది సాధిస్తారు. 

•  క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు, ఆలోచనలు నిజమవుతాయి.

•  సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి. 

• గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. 

•  కుటుంబ , సన్నిహితుల వైకరితో సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది.

• రక్షాయంత్రం ఎల్లప్పుడూ దగ్గర పెట్టుకోవడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.

• వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయట పెట్టరాదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు. 

• సివిల్‌ సర్వీస్‌లు, ఇతర  టెండర్ల విషయంలో కొంత అయోమయం ఏర్పడుతుంది. 

• వ్యక్తిగత, ఆఫీసు రహస్యాలను శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మకద్రోహులను గమనించి తగిన చర్యలు తీసుకుంటారు. 

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.