Asianet News TeluguAsianet News Telugu

మీ జన్మనక్షత్రం ప్రకారం పెంచాల్సిన మొక్కలు ఇవే...

ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము అని ఉంటాయి. నక్షత్రాలను 'స్త్రీ' నక్షత్రాలు 'పురుష' నక్షత్రాలుగా విభజించారు మన పెద్దలు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన భాద్యత మనపై వుంది. 

trees according to your  Birth star - bsb
Author
hyderabad, First Published Nov 6, 2020, 10:54 AM IST

ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము అని ఉంటాయి. నక్షత్రాలను 'స్త్రీ' నక్షత్రాలు 'పురుష' నక్షత్రాలుగా విభజించారు మన పెద్దలు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన భాద్యత మనపై వుంది. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

జ్యోతిషశాస్త్ర ప్రకారం నక్షత్రాలకు గ్రహాలు అధిపతులుగా ఉంటారు. దేవతలు అది దేవతలుగా ఉంటారు. నక్షత్రాలు దేవ, రాక్షస. మానవ గణాలుగా మూడు రకాలు విభజించబడి ఉంటాయి. ఆది నాడి, అంత్య నాడి, మధ్య నాడి అని మూడు విధాలుగా నాడీ విభజన చేయబడుతుంది. అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కో జంతువు, పక్షి, వృక్షము అని ఉంటాయి. నక్షత్రాలను 'స్త్రీ' నక్షత్రాలు 'పురుష' నక్షత్రాలుగా విభజించారు మన పెద్దలు. పర్యావరణ పరిరక్షణకు, ముఖ్యంగా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి తప్పనిసరిగా మొక్కల్ని పెంచాల్సిన భాద్యత మనపై వుంది. మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఏ వృక్షాన్నిపెంచితే మంచిదనే వివరాలు కింది వివరించ బడ్డాయి.

మన జన్మ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని నాటి దానిని శ్రద్ధగా పోషించి ప్రతి రోజు మన నక్షత్ర వృక్షానికి ప్రదక్షిణ చేస్తే చాలా మేలు జరుగుతుంది. మీ జాతక పరిశీలన చేసిన జ్యోతిష పండితుల సూచన మేరకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏ విధమైన పూజ చేస్తే గోచార గ్రహస్థితి మెరుగు పడుతుంది అని తెలుసుకుని పూజ, ప్రదక్షిణలు ప్రారంభించండి.  

జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకు 27 నక్షత్రాలు.

నక్షత్ర వివరాల జాబితా:- నక్షత్రం, నక్షత్రాధిపతి, అధిదేవత, గణము, జాతి, జంతువు, పక్షి, వృక్షము, రత్నం, నాడి, రాశి.

అశ్విని:- కేతువు, అశ్వినీదేవతలు, దేవగణము, పురుష, గుర్రము, గరుడము, అడ్డసరం, విషముష్టి, జీడిమామిడి, వైడూర్యం, ఆదినాడి, 4 పాదాలు, మేషము.

భరణి:- శుక్రుడు, యముడు, మానవగణము, స్త్రీ, ఏనుగు, పింగళ, దేవదారు, ఉసిరిక, వజ్రము, మధ్యనాడి,  4 పాదాలు, మేషరాశి.

కృత్తిక: -  సూర్యుడు, రాక్షస గణము, పురుష, మేక, కాకము, బెదంబర, అత్తి, కెంపు, అంత్యనాడి, 1మేషము - 2 - 4 వృషభం.

రోహిణి:- చంద్రుడు, బ్రహ్మ, మనుష్యగణము, పురుష, సర్పం, కుకుటము, జంబు (నేరేడు ), ముత్యం, అంత్యనాడి, 4 వృషభం.

మృగశిర:- కుజుడు, దేవగణం, ఉభయ, సర్పం, మయూరము, చండ్ర, మారేడు, పగడం, మధ్యనాడి, 2 వృషభం, 2 మిధునం.

ఆరుద్ర :-  రాహువు, రుద్రుడు, మనుష్యగణం, పురుష, శునకం, గరుడము, రేల, చింత, గోమేధికం, ఆదినాడి, 4 మిధునం.

పునర్వసు:- గురువు, అధితి, దేవగణం, పురుష, మార్జాలం ( పిల్లి ), పింగళ వెదురు, గన్నేరు, కనక పుష్యరాగం, ఆదినాడి, 1-3 మిధునం, 4 కర్కాటకం.

పుష్యమి:- శనిగ్రహం, బృహస్పతి, దేవగణం, పురుష, మేక, కాకము, పిప్పిలి, నీలం, మధ్యనాడి, 4 కర్కాటకం.

ఆశ్లేష:- బుధుడు, సర్పము, రాక్షసగణం, స్త్రీ, మార్జాలం, కుకుటము, నాగకేసరి, సంపంగి, చంపక, పచ్చ, అంత్యనాడి, 4 కర్కాటకం.

మఖ :- కేతువు, పితృదేవతలు, రాక్షసగణం, పురుష, మూషికం, మయూరము, మర్రి, వైడూర్యం, అంత్యనాడి, 4 సింహరాశి.

పూర్వఫల్గుణి :- శుకృడు, భర్గుడు, మనుష్యగణం, స్త్రీ, మూషికం, గరుడము, మోదుగ, వజ్రం, మధ్యనాడి, 4 సింహం.

ఉత్తర:- సూర్యుడు ఆర్యముడు, మనుష్యగణము, స్త్రీ, గోవు, పింగళ, జువ్వి, కెంపు, ఆదినాడి, 1 సింహం, 3 - 4 కన్య.

హస్త:- చంద్రుడు, సూర్యుడు, దేవగణం, పురుష, మహిషము, కాకము, కుంకుడు, జాజి, ముత్యం, ఆదినాడి, 4 కన్య.

చిత్త:-  కుజుడు, త్వష్ట్ర, రాక్షసగణం, వ్యాఘ్రం ( పులి ), కుకుటము, తాటిచెట్టు,  మారేడు, పగడం, మధ్యనాడి, 2 కన్య, 2 తుల.

స్వాతి: - రాహువు, వాయు దేవుడు, దేవగణం, మహిషి, మయూరము,  మద్ది, గోమేధికం, అంత్యనాడి, 4 తుల.

విశాఖ:- గురువు, ఇంద్రుడు, అగ్ని, రాక్షసగణం, స్త్రీ, వ్యాఘ్రము ( పులి ), గరుడము, నాగకేసరి , వెలగ ,మొగలి, కనక పుష్యరాగం, అంత్యనాడి 1-3 తుల, 4 వృశ్చికం.

అనూరాధ  :- సూర్యుడు, దేవగణం, పురుష, జింక, పింగళ, పొగడ, నీలం, మధ్యనాడి, 4 వృశ్చికం.

జ్యేష్ట:- బుధుడు, ఇంద్రుడు, రాక్షసగణం, లేడి, కాకము, విష్టి, పచ్చ, ఆదినాడి, 4 వృశ్చికం.

మూల:- కేతువు, నిరుతి, రాక్షసగణం, ఉభయ, శునకం, కుకుటము, వేగిస, వైడూర్యం, ఆదినాడి, 4 ధనస్సు.

పూర్వాషాఢ: - శుకృడు, గంగ, మనుష్యగణం, స్త్రీ, వానరం, మయూరము, నిమ్మ, అశోక, వజ్రం, మధ్యనాడి, 4 ధనస్సు.

ఉత్తరాషాఢ: -సూర్యుడు, విశ్వేదేవతలు, మానవగణం, స్త్రీ, ముంగిస, గరుడము, పనస, కెంపు, అంత్యనాడి, 1 ధనస్సు, 2 ,3, 4 మకరం

శ్రవణము:-  చంద్రుడు, మహావిష్ణువు, దేవగణం, పురుష, వానరం, పింగళ, ముత్యం, జిల్లేడు, అంత్యనాడి  4 మకరం.

ధనిష్ట:- కుజుడు, అష్టవసుడు, రాక్షసగణం, స్త్రీ, సింహము, కాకము, జమ్మి, పగడం, మధ్యనాడి, 2 మకరం, 2 కుంభం.

శతభిష:- రాహువు, వరుణుడు, రాక్షసగణం, ఉభయ, అశ్వం ( గుర్రం ), కుకుటము, అరటి, కడిమి, గోమేధికం, ఆదినాడి, 4 కుంభం.

పూర్వాభాద్ర:-  గురువు, అజైకపాదుడు, మనుష్యగణం, పురుష, సింహం, మయూరము, మామిడి, కనక పుష్యరాగం, ఆదినాడి, 3 కుంభం, 1 మీనం.

ఉత్తరాభద్ర: - శని, అహిర్బుద్యుడు, మనుష్యగణం, పురుష, గోవు, మయూరము, వేప, నీలం, మధ్యనాడి, 4 మీనం.

రేవతి: - బుధుడు, పూషణుడు, దేవగణం, స్త్రీ, ఏనుగు, మయూరము, విప్ప, పచ్చ, అంత్యనాడి, 4 మీనం.

Follow Us:
Download App:
  • android
  • ios