Asianet News TeluguAsianet News Telugu

సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్ లో బ్లడ్ మూన్ కనిపించే సమయం ఇదే

ఆస్ట్రేలియాలో సంపూర్ణ  చంద్రగ్రహణం కనిపించనుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించనుంది. దాదాపు 14 నిమిషాల పాటు.. సంపూర్ణ చంద్ర గ్రహణం కనపడనుంది.

Total Lunar Eclipse 2021: Chandra Grahan on March 26, check India timings for Blood Moon
Author
Hyderabad, First Published Mar 19, 2021, 2:25 PM IST

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. మే 26న ఈ ఏడాది చంద్రగ్రహణం ఏర్పుడుతోంది. అది సంపూర్ణ చంద్ర గ్రహణం కావడం గమనార్హం. చంద్రగ్రహణంలో దాదాపు మూడు రకాలు ఉంటాయి. సంపూర్ణ  చంద్ర గ్రహణం, పాక్షిక చంద్ర గ్రహణం, పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం. భూమి వెనక్కి చంద్రుడు వచ్చిన సమయంలో.. చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలు..


ఆస్ట్రేలియాలో సంపూర్ణ  చంద్రగ్రహణం కనిపించనుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించనుంది. దాదాపు 14 నిమిషాల పాటు.. సంపూర్ణ చంద్ర గ్రహణం కనపడనుంది.

టైమండ్‌డేట్.కామ్ ప్రకారం, ఈ చంద్ర గ్రహణం పాక్షికంగా దక్షిణ / తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అంటార్కిటికాలో కనిపిస్తుంది.

భారత్ లో చంద్ర గ్రహణ వివరాలు..

భారత్ లో పెనుంబ్రాల్ చంద్రగ్రహణం దర్శనమివ్వనుంది. 

ప్రారంభం: బుధవారం, మే 26 2021, 19:14

గరిష్టంగా: మే 26, 2021, 19:16 -0.897 మాగ్నిట్యూడ్

ముగిసే కాలం: బుధ, 26 మే 2021, 19:19

వ్యవధి: 5 నిమిషాలు

సంపూర్ణ చంద్ర గ్రహణం భారత్ లో పెద్దగా   కనిపించదు కాని దీనిని పెనుమ్బ్రల్ చంద్ర గ్రహణం లా భావించవచ్చు. ఇది పెనుంబ్రాల్ చంద్ర గ్రహణం కనుక, గుర్తించడం కష్టమవుతుంది. పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios