Asianet News TeluguAsianet News Telugu

సంతానప్రాప్తి కలిగించే సుబ్రహ్మణ్య షష్ఠి

తారకుడు అనే రాక్షసుడు దేవతలను బాగా పీడిస్తూ ఉంటాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇంద్రుడు అప్పుడు చేయవలసింది ఏమీ లేక ఈ మిషయంలో బ్రహ్మతో ఇలా అంటాడు.యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతికి పెళ్ళి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకుణ్ణి సంహరిస్తాడని చెప్తారు.

today subramanya sashti
Author
Hyderabad, First Published Dec 13, 2018, 2:24 PM IST

మాసానం మార్గశీర్షోహం అని అన్నారు గీతాచార్యులు. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంధషష్ఠి అని, సుబ్రహ్మణ్య అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు అంత ప్రత్యేకత ఎందుకు అనుకుంటే దానికి ఒక గాథ ఉంది.

సుబ్రహ్మణ్యుడు అంటే సు = అంటే మంచిది, బ్రహ్మ = తెలుసుకోదగినవాడు, చక్కగ తెలుసుకోదగిన జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే జ్ఞానం కూడా వస్తుంది. మిద్యార్థులకు చదువుకూడా బాగా వస్తుంది.

తారకుడు అనే రాక్షసుడు దేవతలను బాగా పీడిస్తూ ఉంటాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇంద్రుడు అప్పుడు చేయవలసింది ఏమీ లేక ఈ మిషయంలో బ్రహ్మతో ఇలా అంటాడు.యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతికి పెళ్ళి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకుణ్ణి సంహరిస్తాడని చెప్తారు. అప్పుడు దేవతలు బ్రహ్మ సహాయంతో శివ పార్వతులకు సంధానం చేస్తారు. కుమారస్వామి పుడతారు. అతని పుట్టుక ఒకానొక మార్గశిర శుద్ధ షష్ఠినాడు జరుగుతుంది.   కాబట్టి సంతానం కావాలనుకునేవారు ఈ రోజు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి.

మన శరీరంలో ఉండే కుండలినీ శక్తికి సుబ్రహ్మణ్యస్వామి అధిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యస్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసినవారికి లేదా ఎనర్జీని పాడు చేసినవారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడడం కోసం ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. కొంతమంది ఈ రోజు బ్రహ్మచారులను పూజిస్తారు.

మిద్యుత్‌ అయస్కాంత శక్తికి కారకుడు ఈ సుబ్రహ్మణ్యస్వామి. సృష్టిలో ఉంటే కాంతి తరంగాలు ఎప్పుడూ వంగి ప్రయాణం చేస్తాయి. వీటన్నికీ కారణం సుబ్రహ్మణ్యస్వామి.

ఈ పూజ చిన్న పిల్లలో కొంత ప్రాచుర్యంలో ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి చూసి వద్దాం రండి, మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి, మళ్ళీ వద్దాం రండీ అంటూ పాటపాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది అందరికీ తెలిసిన పండుగ.

వండని పదార్థాలు నైవేద్యంగా ప్టోలి. బియ్యపు పిండి, బెల్లంతో చేసిన చలిమిడి నివేదన చేయాలి. నువ్వు పప్పు, బెల్లం, వడపప్పు పానకం నివేదన చేయాలి.

సంతాన దోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు, సంతానంకోసం అవస్తలు పడుతున్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిండం, ఉపవాసం ఉండడం తప్పనిసరిగా చేయాలి. సంతానం కలగడానికి శక్తి కావాలి. శక్తిని నిర్వీర్యం చేస్తే సంతానం కలుగదు. కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్యస్వామికి పూజ చేయాలి. సంతానానికి కావలసిన శక్తిని ఇచ్చేవాడు సుబ్రహ్మణ్యస్వామి.

మార్గశిర మాసంలో వచ్చే ఒక్క షష్ఠి మాత్రమే కాకుండా ప్రతీ మాసంలో వచ్చే షష్ఠిని పూజిస్తూ, అలాగే కృత్తికా నక్షత్రం నాడు కూడా సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వలన సంతాన సంబంధ దోషాలు రాకుండా ఉంటాయి.  ప్రతీ మాసంలో పూజ చేస్తూ ఈ షష్ఠినాడు కూడా పూజ చేయడం వల్ల వారికి కావలసిన సత్సంతానం లభిస్తుంది. గణపతిని ఏ మిధంగానైతే ఆరాధిస్తామో అదేమిధంగా సుబ్రహ్మణ్యస్వామిని కూడా ఆరాధన చేయాలి. ప్రకృతికి సంకేతంగా మాత్రమే ప్రకృతిలో లభించే వాటితో మాత్రమే ఆరాధించాలి. ఇతనికి పెట్టే నైవేద్యం కూడా ఆర్బాలు లేకుండా తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు అలాగే బలవర్ధకమైన పదార్థాలు నైవేద్యంగా నివేదన చేసి ఆహారంగా స్వీకరించాలి. ఎక్కువసేపు భగవంతునితో గడిపే ప్రయత్నం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios