8 సెప్టెంబర్ 2018 శ‌నివారం మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today september8th your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. చేసే వృత్తిలో నైపుణ్యతను పెంచుకోవాలి. అధికారులతో అనుకూలత అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. అన్ని పనుల్లోను ఒత్తిడి ఉంటుంది. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఉంటుంది. ఆహారంలో సమయపాలన అవసరం. విద్యార్థులకు ఒత్తిడి సమయం. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి చేస్తారు. సంతృప్తి లోపం ఉంటుంది.  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సహకారం వల్ల కొంత అనుకూలత ఉంటుంది.  వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. శ్రమ, కాలం, ధనం వృథా అవుతుంది. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వాగ్దానాలు నెరవేరుస్తారు. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక అనుబంధాల్లో ప్రోత్సాహం ఉండదు. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. పది మందిలో గౌరవం కోసం  ఆరాటపడతారు.వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అవసరం. పనుల్లో గుర్తింపుకోసం ఆరాటపడతారు. పోటీల్లో గెలుపుకై ఆలోచన ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం చేస్తారు.  ఋణాల వల్ల అనుకూలత ఏర్పడుతుంది.  చేసే పనుల్లో ప్రణాళికలు అవసరం. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి.  ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విశ్రాంతి లోపం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు.   సంతాన ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువ. సృజనాత్మకతను కోల్పోతారు. ఉపాసనా సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. విద్యార్థులకు ఒత్తిడి. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది. 

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు ఉంటాయి. విద్యార్థులకు కష్టకాలం.  ఆహారంలో జాగ్రత్త వహించాలి. మాతృసౌఖం లభించదు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సమిష్టి ఆదాయాలపై దృష్టి పెడతారు.  గౌరవం కోసం ఆరాట పడతారు. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. అనుకోని ఆటంకాలు వస్తాయి. అన్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కమ్యూనికేషన్స్‌ వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. పరామర్శలు చేస్తారు.  ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అనవసర ఇబ్బందులు పడతారు. వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో అనుకోని సమస్యలు వస్తాయి. మాట విలువ పెంచుకునే ప్రయత్నం. కంటి   సంబంధ లోపాలు. ఆర్థిక నిల్వలు కోల్పోయే ప్రమాదం. దాన ధర్మాలు అవసరం. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కార్యసాధనలో పట్టుదల అవసరం. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శ్రమాధిక్యం ఉంటుంది. పదిమందిలో గౌరవం కోసం ఆరాటం. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి.    ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలకు అనుకూలం. శ్రమ, కాలం, ధనం వృథా అవుతాయి. పరాధీనత ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతి అవసరం. మానసిక ప్రశాంతత లోపం. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమలేని ఆదాయం పై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. సమిష్టి ఆశయ సాధన. సమిష్టి ఆదాయం వస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పదిమందిలో గౌరవం కోసం ఆరాటం. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం, గణపతిపూజ చేసుకోవడం మంచిది.

డా. ఎస్‌. ప్రతిభ

ఇవి కూడా చదవండి

ఈ వారం( సెప్టెంబర్7 నుంచి సెప్టెంబర్ 13వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios