Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం( సెప్టెంబర్7 నుంచి సెప్టెంబర్ 13వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

astrology..this week horoscope(7sep to 13sep)is here
Author
Hyderabad, First Published Sep 7, 2018, 2:15 PM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాల వల్ల ఒత్తిడులు వచ్చే సూచన. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సంతానవర్గం విషయంలో ఒత్తిడులు ఉంటా యి. సృజనాత్మకతను కోల్పోతారు.  శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. శతృవులపై విజయానికై ప్రయత్నం. ఋణ సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. చేసే అన్ని పనుల్లోను జాగ్రత్త అవసరం. యోగా ప్రాణాయామాలు అవసరం. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మాతృవర్గీయుల సహకారానికై ప్రయత్నం. సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ వల్ల అనుకూలత ఉంటుంది. సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆహారంలో సమయపాలన అవసరం. మాతృసౌఖ్యం లోపిస్తుంది. సృజనాత్మకతను కోల్పోతారు. విద్యార్థులు ఒత్తిడితో  పైకి వస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. సంతాన ఆలోచనల్లో సమస్యలు ఉంటా యి. ఆత్మీయత, అనురాగాలపై దృష్టి ఏర్పడుతుంది. ఆలోచనల్లో మార్పులు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి. కుటుంబంలో అసౌకర్యం ఉంటుంది. నిల్వధనాన్ని కోల్పోయే అవకాశం. తల్లితండ్రుల సహకారం లభిస్తుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడులు ఉంటా యి. విద్యార్థులకు ఒత్తిడి కాలం. ఉన్నత విద్యలకై ప్రయత్నిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఇబ్బందులు తెచ్చుకోవద్దు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు వచ్చే సూచన. సృజనాత్మకతను కోల్పోతారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనల్లో మార్పులు ఉంటా యి. కార్యసాధనలో పట్టుదల అవసరం. వాక్‌ చాతుర్యం తగ్గుతుంది. అనుకోని ఇబ్బందులు ఉంటా యి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో కలతలకు అవకాశం ఉంటుంది. సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. అనుకోని ఖర్చులు చేస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు. ప్రయాణాల్లో లోపాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడితో పనుల సాధన. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. ఆశయాలకు అనుగుణంగా ఆలోచనల్లో మార్పులు వస్తాయి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : కళలపై ఆసక్తి పెరుగుతుంది.  సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. సమిష్టి ఆదాయాల ఆలోచన పెరుగుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటం. పెద్దలందు గౌరవం. కీర్తి ప్రతిష్టలకోసం ఆరాటం. వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఆటంకాలు వచ్చే సూచన. కార్యసాధనలో ప్రణాళిక అవసరం. నిరంతర జపం మంచిది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారులతో అప్రమత్తత అవసరం. తోటి  ఉద్యోగులతో ఒత్తిడి ఉంటుంది. సౌకర్యవంతమైన జీవితంపై దృష్టి. అన్ని రకాల ఆదాయాలు వస్తాయి. అనవసర ఖర్చులపై దృష్టి ఉంటుంది.  అనవసర ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటా యి. రాజకీయాలపై కొంత దృష్టి ఉంటుంది. పెద్దలంటే గౌరవ, మర్యాదలు ప్రదర్శిస్తారు. దేహ సౌఖ్యం లోపిస్తుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శుభ కార్యాలపై దృష్టి ఉంటుంది. సజ్జనుల సాంగత్యం చేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఉత్తమమైన సమయం. దూరదృష్టి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్తలు. కొంత అనుకూలత. సమిష్టి ఆశయాలు. కళలపై ఆసక్తి పెరుగుతుంది. విశ్రాంతి లోపం ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అనుకోని ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి.  అధికారులతో అప్రమత్తత. అధికారిక ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం. దురాశ వచ్చే సూచన. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో అప్రమత్తత. ప్రమాదాలకు అవకాశం. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది. అన్నదానం అత్యవసరం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి. భాగస్వాములతో అప్రమత్తత. పదిమందిలో గౌరవం కోసం ఆరాటం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. శుభకార్యాలకై ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు గట్టుకాలం. శ్రమాధిక్యం ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది. అన్నదానం చేయడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. అనారోగ్య సూచన. అనవసర భయాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు చేసే ప్రయత్నం. గుర్తింపుకోసం ఆరాటపడతారు. రోగనిరోధక శక్తి పెంచుకునే ప్రయత్నం. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. శత్రువులపై దృష్టి సారిస్తారు. ఋణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. ఔషధ సేవనం తప్పనిసరి. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది. తెల్లి వస్త్రాలు, అన్నదానం అవసరం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వైవాహిక జీవితంలో సమస్యలపై దృష్టి. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. చెడు మార్గాల ద్వారా ధనసంపాదనకు ప్రయత్నం చేస్తారు. పరామర్శలు చేస్తారు. క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. విద్యార్థులకు ఒత్తిడి సమయం. పోటీల్లో  గెలుపుకై అధిక ప్రయాస పడతారు. వృత్తి విద్యలపై దృష్టి సారిస్తారు. శారీరక బలం పెంచుకునే ప్రయత్నం. కలహాలపై దృష్టి ఉంటుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ప్రతిభ

ఇవి కూడా చదవండి

ఈ సెప్టెంబర్ నెల రాశిఫలాలు

Follow Us:
Download App:
  • android
  • ios