Asianet News TeluguAsianet News Telugu

22 సెప్టెంబర్ 2019 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మాతృసౌఖ్యం లభిస్తుంది. గృహ సంబంధ ఆలోచనల్లో మునిగి పోతుంది. తల్లి దగ్గర ప్రేమ పెరుగుతుంది. ఆహార సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులకు  లభిస్తుంది. తల్లి తరఫు బంధువుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు.

today september 22nd 2019 your horoscope
Author
Hyderabad, First Published Sep 22, 2019, 7:58 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆలోచనలపై దృష్టి సారిస్తారు. క్రియేివిటీ పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన సంబంధ విషయాల్లో ఆలోచన పెరుగుతుంది. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మాతృసౌఖ్యం లభిస్తుంది. గృహ సంబంధ ఆలోచనల్లో మునిగి పోతుంది. తల్లి దగ్గర ప్రేమ పెరుగుతుంది. ఆహార సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులకు  లభిస్తుంది. తల్లి తరఫు బంధువుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు. శ్రీరామ జయరామ జయజయ రామరామ

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సోదరవర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు అనుకూలం. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శ్రీ మాత్రేనమః మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు. వాక్‌ చాతుర్యం తగ్గుతుంది. మాటల్లో కాఠిన్యత పెరుగుతుంది. మధ్యవర్తిత్వాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో అననుకూలతలు వచ్చే సూచనలు. స్నేహసంబంధాలు దూరమవుతాయి. జాగ్రత్తగా మెలగాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన చేస్తారు. శరీర ధారుఢ్యం బాగుంటుంది. కండబలం వలన అహంకారం వచ్చే సూచనలు. జాగ్రత్త వహించాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. అనసవర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఒకపని చేసే ముందు ఆచి, తూచి అడుగు ముందుగు వేయాలి. విశ్రాంతి తక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిరంతర జపం మేలు చేస్తుంది. శ్రీ మాత్రేనమః

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అన్ని రకాల లాభాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళానైపుణ్యం పెరుగుతుంది. ఆదర్శవంతమైన జీవితం ఏర్పడుతుంది. ఉపాసన పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సోదరవర్గీయులద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామజయరామ జయజయరామ రామ జపం

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  అధికారిక ప్రయాణాలు చేస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. చేసే వృత్తులలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో పరపరతి పెరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. కీర్తి ప్రతిష్టల వల్ల సంఘంలో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విద్య నేర్చుకోవడం వల్ల ఉన్నతి పెరుగుతుంది. పరాక్రమం తో పనులు పూర్తి చేస్తారు. సజ్జన సాంగత్యం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. ఉన్నత విద్యల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. దూరదృష్టి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అవమానాలు భరించాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. పరామర్శలపై దృష్టి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. అనసవర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. క్రయ విక్రయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదన. వైద్యశాలల సందర్శనం. శ్రీ మాత్రేనమః

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. నష్టవస్తు పరిజ్ఞానం లభిస్తుంది. పదిమందిలో పలుకుబడి లభిస్తుంది. సామాజిక అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం. పెట్టుబడుల విషయంలో మోసపోకుండా జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు ఒత్తిడిని కలిగిస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు తగ్గుతాయి. ఋణభారాలు తగ్గుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.  శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios