జులై 12, 2018 గురువారం మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today july12th your horoscope

మేషం

ఈ రోజు ఇంటిపట్టున ఉండి చాలా రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుసుకుంటారు. ఇల్లు లేదా భూ సంబంధ లావాదేవీలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా, కొంత సామాన్యంగా ఉంటుంది.

వృషభం

ఈ రోజు వ్యాపార వ్యవహారాలకు, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవటం మంచిది.

మిథునం

ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం, ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనడం కానీ, బాగు చేయించడం కానీ చేస్తారు.

కర్కాటకం

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయడం చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది.

సింహం

ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవడం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.

కన్య

ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకోని ధనాదాయం ఉంటుంది. మీ స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎంత ప్రయత్నం చేసినా కానీ పనులు ఈ రోజు ఏ ప్రయ త్నం లేకుండానే పూర్తవుతాయి.

తుల

ఈ రోజు మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృశ్చికం

ఈ రోజు మీరు రోజువారి కార్యక్రమాల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

ధనుస్సు

ఈ రోజు చేపట్టిన పనుల్లో అనుకోని అడ్డంకుల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆవేశానికి లోనుకుండా స్థిమితంగా ఉండటం మంచిది. పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూలమైన రోజు కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎదుటివారిని నమ్మి డబ్బులు ఇవ్వకండి.

మకరం

వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనస్సులోని భావాలను మీ జీవిత భాగస్వామికి వ్యక్తం చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా ఇతర వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

కుంభం

ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావడం, లోన్ రావడం కానీ జరుగుతుంది. ఉద్యోగం విషయంలో ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉం టుంది. కోర్టు కేసులు, వివాదాల్లో విజయం సాధిస్తారు.

మీనం

ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచడానికి అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios