Asianet News TeluguAsianet News Telugu

జులై 11 బుధవారం 2018..మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today july11th your horoscope

మేషం

మేషం: ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. వదం తులను, చెప్పుడు మాటలను పట్టించుకోకండి.

వృషభం

వృషభం: ఈ రోజు కొత్త పనులు ప్రారంభించటానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది.ఆలోచనతో పనులు పూర్తి చేయండి.

మిథునం

మిథునం : ఆర్థిక, గృహ మరియు భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంది. శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీ పై అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటకం

కర్కాటకం: ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతు లు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందం గా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యూనికేషన్‌కు అనుకూల దినం.

కన్య

కన్య : ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకుంటారు. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ పరిష్కరించబడతాయి. ఖర్చు ల విషయంలో ఆచి, తూచి అడుగేయండి.

తుల

తుల : మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవస రం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శిస్తారు. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు.

వృశ్చికం

వృశ్చికం: పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటి విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సం బంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్నీ పనులు చేయగలుగుతారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంది. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

మీనం

మీనం : కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేస్తా రు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. కమ్యూనికేషన్‌కు అనుకూలం.

Follow Us:
Download App:
  • android
  • ios