జులై 10, 2018 మంగళవారం మీ రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం
ఈ రోజు స్నేహితులు లేదా బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణం కానీ చేస్తారు. విదేశీ ప్రయాణంకు సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. తలపెట్టిన పనులు పూర్తిచేయగలుగుతారు.
వృషభం
ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలం. అనుకోని బహుమతులు కాని, ప్రశంసలు కాని పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు.
మిథునం
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
కర్కాటకం
ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉం టారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.
సింహం
ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన చెందుతారు.
కన్య
ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవటానికి ముఖ్యంగా భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.
తుల
మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. మీ ప్రేమను ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని ఆందోళన మనసులో ఉంటుంది. కాంపిటేటివ్ పరిక్షలు రాస్తున్నవారు విజయం సాధిస్తారు.
వృశ్చికం
ఈ రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సెలవైనప్పటికీ బయటకెళ్లటంకంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. గృహసంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావలసిన డబ్బు చేతికందుతుంది.
ధనుస్సు
ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. షాపింగ్ చేయటం కాని, మిత్రులను కలవటం కానీ చేస్తారు అలాగే వాహన కొనుగోలు కానీ, రిపేర్ చేయించటం కానీ చేస్తారు. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మకరం
ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చుపైన పడటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు.
కుంభం
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది.
మీనం
ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. దానికి కారణంగా కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కాని వివాదం జరగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.