డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : చేసేవృత్తుల్లో లోపాలు ఉంటాయి. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి. ఉన్నతమైన ఆలోచనలు. పూర్వపుణ్యం పెంచుకునే ప్రయత్నం. శుభకార్యాల్లో పాల్గొటాంరు. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విశాలభావాలు ఏర్పడతాయి. గౌరవం పెరుగుతుంది. గురువులతో అనుకూలత ఏర్పడుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఇతరులతో వ్యవహరించునప్పుడు జాగ్రత్త అవసరం. అవమానాల పాలు కాకుండా చూసుకోవాలి. చెడు మార్గాల ద్వారా ఆదాయం. చెడు స్నేహాలు, మృతధనం పై ఆశ ఉంటుంది. ఊహించని ఖర్చులు, ప్రమాదాలు జరుగుతాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాల్లో లోపం ఉంటుంది. భాగస్వామ్య సంబంధాలు తగ్గుతాయి. మిత్రులతో ఆచి, తూచి వ్యవహరించాలి. అందరితో జాగ్రత్తగా మెలగాలి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే సూచన.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శతృవులపై విజయం సాధిస్తారు. పోీల్లో గెలుపు ఉంటుంది. ఇచ్చిన రుణాలు తిరిగి వస్తాయి. ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. ఔషధ సేవనం తప్పనిసరి. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. చిత్త చాంచల్యం ఎక్కువ. విద్యార్థులు ఒత్తిడితో ఫలితాలు సాధిస్తారు. సంతానం వల్ల ఇబ్బందులు అధికం. ఆత్మీయతకోసం ఆరాట పడతారు.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల పై దృష్టిఏర్పడుతుంది. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొటాంరు. వాహన సౌఖ్యం కోల్పోతారు. ఆహారంలో సమయ పాలన అవసరం. పనులలో జాప్యం ఏర్పడుతుంది. ప్రాథమిక విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సేవకజన సహకారం పెరుగుతుంది. తోటి వారితో అనుకూలత ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఏర్పడుతుంది.  ప్రసార, ప్రచార సాధనాలు అనుకూలం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మధ్యవర్తిత్వాల్లో జాగ్రత్త అవసరం. మాటల వల్ల కొంత వైవిధ్యం, కొంత అనుకూలత ఏర్పడుతుంది.  ఆచి, తూచి వ్యవహరించాలి. కుటుంబంలో జాగ్రత్త అవసరం. నిల్వ ధనంపై దృష్టి పెరుగుతుంది. కంటి సంబంధ లోపాలు రావచ్చు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శరీర శ్రమ అధికం. అనుకున్న పనులు చేయడంలో జాప్యం ఏర్పడుతుంది. ఆలోచనల్లో అననుకూలత ఉంటుంది. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం. శరీరానికి రోజూ యోగా ప్రాణాయామం తప్పనిసరి. పట్టుదలతో కార్య సాధన అవసరం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకై దృష్టి.  అనవసర ఖర్చులు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికం. దేహసౌఖ్యం కోల్పోతారు. ఇతరులపై ఆధారపడతారు. ప్రశాంతతకై ఆరాట పడతారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సేవకుల ద్వారా ఆదాయం. సేవకజన సహకారం లభిస్తుంది. ఇతరులపై ఆధారపడతారు. ఆదర్శవంతమైన జీవితంకోసం ప్రయత్నం. అన్ని రకాల ఆదాయాలకై ప్రయత్నం, ఉపాసన చేయాలనే ఆలోచన ఉంటుంది.