today astrology: 09 మార్చి 2020 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. పనులలో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.  కళాకారుల్లో ఉన్నత స్థాయి వారికి గౌరవాదరాభిమానాలు లభిస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం.

today dinaphalithalu 9th march 2020

డా. ఎస్‌. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ కొంత పెరుగుతుంది. సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. శరీర సౌందర్యం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అలంకరణలపై దృష్టి పెరుగుతుంది. పనులు పూర్తి చేయడంలో ఆలోచిస్తారు. కళాత్మకమైన వ్యవహారాలపై దృష్టి ఉంటుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. కళాకారులకు అనుకూలమైన సమయం. కళలపై దృష్టి సారిస్తారు. విహారయాత్రలు చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విలాసాలు పొందే ప్రయత్నం చేస్తారు. సంతోషకర జీవితం గడుపుతారు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాత్మకమైన పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. కళలపై ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. లాభాలు సంతృప్తినిస్తాయి. చిత్త చాంచల్యం తగ్గతుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగ విషయంలో సంతోషం ఉంటుంది. కళాకారులకు అనుకూలమైన వాతావరణం. వాహన సౌకర్యాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. కళాపోషకులు అనుకున్న పనులు పూర్తిచేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంతృప్తి లభిస్తుంది. పనులలో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.  కళాకారుల్లో ఉన్నత స్థాయి వారికి గౌరవాదరాభిమానాలు లభిస్తాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి సారిస్తారు. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. సుఖ వ్యాధులు వచ్చే సూచనలు. భాగస్వాముల మధ్య కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వాములతో అనుకూలత పెరుగుతుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. కళాకారులకు నైపుణ్యం పెరుగుతుంది. భాగస్వాముల మధ్య సయోధ్య పెంచుకోవాలి. కళలపై ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పోటీల్లో గెలుపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రుణ సంబంధ ఆలోచనలు తొలగిపోతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. విద్యార్థులు ఆనందకరవాతావరణం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సృజనాత్మకత పెరుగుతుంది. చిత్తచాంచల్యం తగ్గతుంది. కళాకారులకు కళలపై ఆసక్తి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తంపై సంతోషంగా కాలం గడుపుతారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. సౌకర్యాల వల్ల ఒత్తడిపెరుగుతుంది. సుఖం కోసం ఆలోచన తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది. గృహ సంబంధ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మాతృవర్గీయుల, లేదా కళాకారుల సహాయ సహకారాలు లభిస్తాయి.  కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమై సమయం. సంప్రదింపుల్లో రాణింపు పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మాటల్లో కళాత్మక పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు.  మాట విలువ పెరుగతుంది. మధ్యవర్తిత్వాలు రాణిస్తాయి. నిల్వధనం పెంచుకుంటారు. ఆభరణాలపై దృష్టి పెరుగుతుంది. సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios