Asianet News TeluguAsianet News Telugu

today astrology: 09 ఆగస్టు 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి గోశాలలో గరిక దానం చేస్తే మంచిది. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లను సాగిస్తారు. ఓ శుభవార్త మీలో మనోధైర్యాన్ని పెంచుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

today dinaphalithalu 9th august 2020
Author
Hyderabad, First Published Aug 9, 2020, 7:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 9th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు  ప్రతి విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. చేపట్టే పనులు, ప్రారంభించే వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. స్వార్థ ప్రపంచాన్ని చూసి నివ్వెరపోతారు. పార్ట్ టైం జాబ్ వర్క్ లను సంపాదించుకోగలుగుతారు. ఆశించిన రుణాలు అందుకోగలుగుతారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు జీవిత భాగస్వామితో కీలక విషయాలనపై చర్చలు సాగిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రతా విషయమై జాగ్రత్తలు పాటించండి. గోశాలలో గరిక దానం చేస్తే మంచిది. రాజకీయ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. కొనుగోళ్లను సాగిస్తారు. ఓ శుభవార్త మీలో మనోధైర్యాన్ని పెంచుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు వ్యాపారపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మిత్రుల సలహాలు, సూచనలు పాటిస్తారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. దీక్షా కార్యక్రమాలు చేపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కళా సాహిత్య రంగాల పట్ల మీకున్న మక్కువ మరింతగా పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓ వార్త భాదను కలిగిస్తుంది. మీ అభిప్రాయాలపై పెద్దలు కూడా ఏకిభవిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన విషయమై శ్రద్ధను కనబరుస్తారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. దారి, తెన్నూలేని వ్యవహారాలను ఓ గాడిలో పెట్టేందుకు గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సెంట్ మెంట్ విషయాలు కలిసి వస్తాయి. వాహన యోగ సూచన ఉంది. బంధువుల సహకారం అందుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. ఏ పనులు తలపెట్టినా త్వరగా పూర్తవుతాయి. సర్వత్రా శుభఫలితాలు ఉన్నాయి. వినోద కార్యక్రమాలకు, విలాసాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పెరుగుతున్న నిత్యవసర ధరలు, ఖర్చులు ఆలోచింపజేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు బంధువుల రాక ఆనందానికి కారణమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన రంగంలోని వారితో పరిచయాలు ఏర్పడుతాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండగలుగుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలను సాగిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు పనలు, వ్యవహారాలకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. శుభవార్త వింటారు. సలహాలు, సూచనలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు. నిష్కారణంగా నిందారోపణలు గురిచేస్తున్న వారిని గుర్తిస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లు నిజమని నమ్ముతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు కీలక వ్యవహారాల్లో పెద్దలు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. వాహన మరమ్మత్తులు చేస్తారు. విశాల హృదయంతో వ్యవహరిస్తారు. అందరి పట్ల సమన్యాయాన్ని కనబరుస్తారు. మంచి వ్యక్తిగా గుర్తింపును సాగిస్తారు. శుభకార్య యత్నాలు కలిసి వస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల సాయంతో ఓ పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. రచనా వ్యాసంగాలను సాగిస్తారు. గృహలంకరణకు ప్రాముఖ్యతనిస్తారు. ఉపయుక్తమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. శ్రేయోభిలాషులతో కలిసి చర్చలు సాగిస్తారు. ఆహార నియమాలను పాటించడం చెప్పదగిన సూచన. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రజాసంబంధాలను మరింతగా వృద్ధి చేసుకుంటారు. 
పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు దుడుకుతనం కలిగి ఉంటారు. చెల్లింపుల విషయమై ఎక్కువగా ఆలోచిస్తారు. ఉత్తమమని భావించిన వ్యవహారాల్లో ఇతరులకు జోక్యం కల్పించకండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios