Asianet News TeluguAsianet News Telugu

today astrology: 6 జూన్ 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వాక్ చాతుర్యం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. ఎదుటివారిని ఒప్పించే నేర్పు కలిగి ఉంటారు. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.  ఆభరణాలు వస్తాయి. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది.

today dinaphalithalu 6th june 2020
Author
Hyderabad, First Published Jun 6, 2020, 7:05 AM IST

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) : వ్యాపార సహకారాలు లభిస్తాయి. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి.  రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం.  సహాధ్యాయులు ఉంటారు. దగ్గరి బంధువులు వస్తారు. చిత్తచాంచల్యం పెరుగుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. ఎదుటివారిని ఒప్పించే నేర్పు కలిగి ఉంటారు. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.  ఆభరణాలు వస్తాయి. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ అధికం అవుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. ఆచి, తూచి వ్యవహరించాలి.  పట్టుదలతో కార్యసాధన పూర్తి చేస్తారు. ఆవయాలకు తగిన అభిరుచులను పెట్టుకుంటారు.  సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. విహార యాత్రలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు అధికం అవుతాయి. చిత్తచాంచల్యం పెరుగుతుంది. వ్యాపార ఖర్చులు, వ్యాపార ప్రయాణాలపై ఆలోచన పెరుగుతుంది. తొందరపాటు పనికిరాదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. వ్యాపార లాభాలు అనుకూలిస్తాయి. లాభాలు సద్వినియోగం చేస్తారు. దురాశ పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. సమిష్ట ఆశయాలు పూర్తిచేస్తారు. రాజకీయ పార్టీలకు అనుకూలమైన సమయం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తరులపై దయ చూపుతారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారస్తులకు సామాజిక అనుబంధాలు మెరుగుపడతాయి.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. దూరదృష్టి ఏర్పడుతుంది. విద్య నేర్చుకోవడం వల్ల గౌరవం పెరుగుతుంది.  న్యాయ విషయాలపై సదభిప్రాయం ఏర్పడుతుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఊహించని ఇబ్బందులు ఏర్పడుతాయి. అవమానాల సూచన. చెడు సాహవాసం పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు సాగించుకుంటారు. పరాధీనం అవుతారు. శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. లాభాలు సంతోషాన్నిచ్చేవిగా ఉంటాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సామాజిక అనుబంధాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం.  భాగస్వామ్య అనుబంధాలు విస్తరిస్తాయి. పదిమందిలో గౌరవం పెరుగుతుంది. మిత్రులు విరోధులు పెరుగుతారు.  నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. వ్యాపార అభివృద్దికి ప్రయత్నం చేస్తారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. రుణ సంబంధ ఆలోచనలు మెరుగుపడతాయి.  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.శారీరక బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు మంచి పోటీ లభిస్తుంది.  

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పనులు చేయడంలో ఆచి, తూచి వ్యవహరిస్తారు. ప్రణాళికాబద్ధమైన వ్యూహరచన చేస్తారు. సంతాన సంబంధ విషయాల్లో కొంత అలజడి పెరుగుతుంది. క్రియేటివిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాల వలన కొంత సంతోషం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తల్లి సంబంధీకులతో అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార ప్రయాణాలు కలిసి వస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios