today astrology: 31 మే 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి విశ్రాంతికై ప్రయత్నం అవసరం. పాదాల నొప్పులు వస్తాయి.  అనసవర ఖర్చులు చేస్తారు. ప్రయణాలలో ఒత్తిడి అధికం అవుతుంది.  సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది. ఇతరులపై  ఆధారపడతారు. అధికారిక ఖర్చులు ఉంటాయి.

today dinaphalithalu 31st may 2020

మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) :  శారీరక శ్రమ అధికం అవుతుంది.  పనులలో ఒత్తిడి పెరుగుతుంది.  పనులు పూర్తి చేయడంలో ఆలస్యం అవుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. పట్టుదలతో కార్యసాధన చేయడం అవసరం. పనులకు అనుగుణంగా ఆలోచనలు మార్చుకోవాలి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం అవసరం. పాదాల నొప్పులు వస్తాయి.  అనసవర ఖర్చులు చేస్తారు. ప్రయణాలలో ఒత్తిడి అధికం అవుతుంది.  సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది. ఇతరులపై  ఆధారపడతారు. అధికారిక ఖర్చులు ఉంటాయి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దల ఆశయాలు నెరవేరుతాయి.  పెద్దలతో అనుకూలతకోసం ప్రయత్నం.  ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాటపడతారు. తరులపై ఆధారపడతారు. అన్ని రకాల లాభాలు వస్తాయి. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అధికారులతో అనుకూలత పెరుగుతుంది.  పనులలో పట్టుదల పెరుగుతుంది. మొండితనంతో పూర్తిచేస్తారు.  సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు.  కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్రమత్తత అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనుకోని ఇబ్బందులు వస్తాయి. పనులలో జాప్యం జరగవచ్చు. చేసే అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.  సంతృప్తికోసం ఆరాట పడతారు.  అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు పనికిరాదు.  అనవసర తిరుగుడు  ఉంటుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అనవసర ఖర్చులు చేస్తారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆరాటపడతారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దానధర్మాలు మేలు చేస్తాయి. ఆచి, తూచి వ్యవహరించాలి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి పెరుగుతుంది. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా ఉండాలి. పాత మిత్రులు కలిసే అవకాశం.  భాగస్వాములతో ఆచి, తూచి వ్యవహరించాలి. సమాజంలో అందరితో కలిసి మెలిసి మెలిగే ప్రయత్నంలో ఉండాలి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పోటీలలో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి.  ఉద్యోగస్తులలో అనుకూలత పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంతాన సమస్యలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. దానికోసం ఆరాటపడతారు.  చిత్త చాంచల్యంతో ప్రణాళికలు వేస్తారు. క్రియేటివిటీ తగ్గతుంది. ఒత్తిడి అధికం అవుతుంది.  అధికారులతో అనుకూలతకై ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌఖ్యంకోసం ఆరాటం పెరుగుతుంది.  గృహసంబంధ విషయాల్లో ఒత్తడి పెరుగుతుంది. ఒత్తిడిత్తో సౌకర్యాలను పూర్తిచేస్తారు.  ఆహారంలో సమయపాలన అవసరం.  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారులతో అనుకూలత పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి.  సహకారం లభిస్తుంది.  ప్రయాణాలు సౌకర్యంగా చేస్తారు.  ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :  నిల్వధనం కోల్పోతారు.  అధికారులతో మాట విషయంలో జాగ్రత్త అవసరం.  మాటల్లో కాఠిన్యత రాకుండా చూసుకోవాలి. కుటుంబ సంబంధాలు ఒత్తిడికి గురిచేస్తాయి. ధన సంపాదనకు ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు పనికిరావు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios