today astrology: 29 జూన్ 2020 సోమవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. ఆదర్శవంతమైన జీవితం గడుపుతారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. సమిష్టి ఆశయాలు పూర్తి చేస్తారు. అన్ని రకాల ఆదాయాలు లభిస్తాయి. లాభాలు సంతోషంతో ఖర్చు పెడతారు. సద్వినియోగం చేస్తారు.
డా. ఎస్.ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఆచి, తూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనాలనే ఆలోచన పెరుగుతుంది. తొందరపాటు వ్యవహారాలు పనికిరావు. పాదాల నొపలు వచ్చే సూచనలు.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. ఆదర్శవంతమైన జీవితం గడుపుతారు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. సమిష్టి ఆశయాలు పూర్తి చేస్తారు. అన్ని రకాల ఆదాయాలు లభిస్తాయి. లాభాలు సంతోషంతో ఖర్చు పెడతారు. సద్వినియోగం చేస్తారు.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంఘంలో గౌరవంకోసం పాడుపతారు. శారీరక బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. శారీరక బలం అధికమౌతుంది. కీర్తిప్రతిష్టలకోసం ఆశిస్తారు. అన్ని రకాల ఫలితాలు లభిస్తాయి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పరిశోధకులకు కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన వస్తుంది. సజ్జన సాంగత్యం చేస్తారు. దూరదృష్టి పెరుగుతుంది. విద్య మొదలైన విషయాలపై ఆసక్తి పెరుగతుంది. విశాల భావాలు ఉంటాయి. శాసనకర్తలు అవుతారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలపై దృష్టి పెడతారు. చెడు సహవాసం తగ్గించుకోవాలి. క్రయ విక్రయాలపై ఆలోచన పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. పరామర్శలు ఉంటాయి. లాభనష్టాలు సమానం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాలు బలపడుతాయి. భాగస్వాములతో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారస్తులుతొందరపాటు పనికిరాదు. నూతన పరిచయస్తులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పదిమందిలో గౌరవంకోసం పాటుపడతారు.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కార్మికులు శ్రమను తట్టుకొని నిలబడతారు. శారీరకబలం పుంజుకుంటుంది. సేవకులకు తగిన ఫలితాలు లభిస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సంతాన సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి పెరుగుతుంది.కళాకారులు తొందరపాటు పనికిరాదు. క్రియేటివిటీ తగ్గిపోతుంది. పరిపాలన సమర్థత పెరుగుతుంది. ప్రశాంతంగా ఉండడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. సౌకర్యాలకోసం ప్రయత్నం చేయకూడదు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తల్లితో అనుకూలత పెంచుకోవాలి. ఆరోగ్య లోపం ఏర్పడే సూచనలు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ప్రయాణాల్లో అనుకూలతకోసం ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రావు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. పరామర్శలు చేస్తారు. ప్రచార ప్రసార సాధనాలు ఉపయోగపడతాయి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మాట విలువ తగ్గుతుంది. మాట్లాడే సమయంలో తొందరపాటు పనికిరాదు. ఆచి తూచి వ్యవహరించాలి. కుటుంబం సంబంధాల మధ్య అనుబంధం తగ్గకుండా జాగ్రత్త పడాలి. నిల్వధనాన్ని కాపాడుకోవాలి. సంపాదన ప్రయత్నం అవసరం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీర శ్రమ అధికం అవుతుంది. పనులు పూర్తి చేయడంలో అధిక శ్రద్ద అవసరం అవుతుంది. ప్రణాళికలు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడికి నిలబడాలి. ఆలోచనలకు అనుగుణంగా పనులు మార్చుకోవాలి. చక్కని ప్రయత్నం ద్వారా అన్ని పనులుపూర్తి. అహంకారం పనికిరాదు.