Asianet News TeluguAsianet News Telugu

today astrology: 29జులై 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. అనవసరంగా మీపై దుష్ప్రచారం చేసేవారి చేసే వారి వల్ల మనసు నొచ్చుకుంటుంది.

today dinaphalithalu 29th july 2020
Author
Hyderabad, First Published Jul 29, 2020, 7:12 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 29th july 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మీ తెలివి తేటలు మీకన్నా ఇతరులకు ఎక్కువగా ఉపకరిస్తాయి. రావాల్సిన మొండి బాకీలు సమయానికి అందుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  మీ అనుభవం, సమర్ధత వృత్తి, ఉద్యోగాలకు చక్కగా ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువుల నుంచి ఆశించిన ఒక బుణం లేదా కార్యం గురించి వ్యతిరేక వార్తను వినాల్సి వస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. కుటుంబంతో గడుపుతారు. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలలో అనుకూలంగా ఉంటుంది. అనవసరంగా మీపై దుష్ప్రచారం చేసేవారి చేసే వారి వల్ల మనసు నొచ్చుకుంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మీ కీర్తి పతాకం రెపరెపలాడుతుంది. అన్ని వ్యవహారాలలోనూ కొంత పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన కుటుంబ సంక్షేమం మానసికానందాన్ని కలిగిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు లౌక్యం లోపించడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మహిళలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక సంబంధ వ్యవహారాలలో వెనకడుగు వేస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలపై దృష్టి సారిస్తారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎదుట మంచిగా మాట్లాడే వారంతా శ్రేయాభిలాషులు కాదని తెలుసుకుంటారు. వైరాగ్య ధోరణిని అవలంబిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఆలోచనను ఆచరణలో పెట్టలేని బద్ధకం శరీరాన్ని ఆవహిన్తుంది. బ్యాంకు రుణాలు, ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. పనిచేసే చోట కార్యాలయాల్లో కొంత మార్పును గమనిస్తారు. ప్రతినిత్యం రావి చెట్టునకు ప్రదక్షిణలు చేయండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఎదురైన సమస్యల పరిష్కారం కోసం దీర్ఘంగా ఆలోచిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా సెల్ఫ్‌ డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం ఉత్తమం. జనాకర్షణ వన్తువులను కొనుగోలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు మంచి చెడులను గ్రహించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులను బాధించడానికి పరోక్షంగా మీ పరపతిని ఉపయోగిస్తారు.స్నేహితుల లోపాలను సరిదిద్దుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు అవసరానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్యపరంగా ఊరట లభించినా ఉత్సాహం లోపిస్తుంది. అయినా ముఖ్యమైన విషయాలు అనుకూలిస్తాయి. అకారణంగా చికాకులు కలవరానికి గురిచేస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు  అన్ని విషయాలలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు వెన్నుదన్నుగా నిలుస్తాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది. సాధించింది కొంతైనా ఎంతో సాధించారనే ప్రచారం అధికంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు  వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ పై చాడీలు చెప్పే సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు నిర్ధయులని అనుకుంటూ వ్యతిరేకించే వ్యక్తులు సహాయం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios