Asianet News TeluguAsianet News Telugu

Horoscope Today: ఓ రాశివారికి బంధు, మిత్రులతో కలహాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు..!

ఈ రోజు రాశిఫలాలు  ఇలా  ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులు,మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు

Today dinaphalithalu 27th January 2022
Author
Hyderabad, First Published Jan 27, 2022, 4:22 AM IST

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు వ్యయప్రయాసలు. బంధువులు,మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు దగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలు మరింత వేగంగా సాగుతాయి. బంధువుల నుంచి సాయం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు సన్నిహితులతో మాటపట్టింపులు.  దూరప్రయాణాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆచితూచి వ్యవహరించండి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా ప్రోత్సాహం. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా గుతాయి. నుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కొన్ని చర్చలు సఫలం. విద్యార్థులకు ఉత్సాహంగా గడుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలతో సతమతమవుతారు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


    డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios