Asianet News TeluguAsianet News Telugu

today astrology: 26 జూన్ 2021 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు ఆటుపోట్లు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఖర్చులు. దూరప్రయాణాలు.

today dinaphalithalu 26th june 2021
Author
Hyderabad, First Published Jun 26, 2021, 7:15 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 26th june 2021

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారులకు శ్రమకు ఫలితం కనిపించదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు ఆటుపోట్లు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఖర్చులు. దూరప్రయాణాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు నూతన పరిచయాలు. కొన్ని చర్చలు సçఫలం. పనుల్లో  విజయం. ఉద్యోగులకు నూతనోత్సాహం.  వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. దైవదర్శనాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కొత్త ఉద్యోగ యత్నాలలో పురోగతి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కార్యక్రమాలలో ఆటంకాలు. భూసంబంధిత వివాదాలు. ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారులకు పెట్టుబడుల్లో ఆటంకాలు. ఉద్యోగులకు లేనిపోని చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆదాయం నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. వ్యాపారులకు పనిఒత్తిడులు. ఉద్యోగులకు గందరగోళం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన సమాచారం. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకూల సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు మిత్రులతో విభేదాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. అనుకోని ధనవ్యయం.  వ్యాపారులకు కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగులకు కొన్ని సమస్యలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల ముఖ్య సమాచారం. వాహనాలు కొంటారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మరింత గుర్తింపు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఉద్యోగులు అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబసభ్యులతో తగాదాల పరిష్కారం.. అదనపు రాబడి ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు.  వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు దూరప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా.  ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు శ్రమాధిక్యం. ఉద్యోగులకు చిక్కులు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios