Asianet News TeluguAsianet News Telugu

Horoscope Today: ఓ రాశివారికి ధన లాభం, శుభకార్యాల్లో పాల్గొంటారు..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. 

Today dinaphalithalu 26th January 2022
Author
Hyderabad, First Published Jan 26, 2022, 3:53 AM IST

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి  అధికారులతో చర్చలకు అనుకూల సమయం. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో  పదోన్నతులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సోదరులతో  ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార  విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు  మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఇంటా బయట సఖ్యత గా వ్యవహరిస్తారు  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయటా చికాకులు అధికమవుతాయి.స్వంత ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. వ్యాపారాలలో భాగస్వాములతో బేధాభిప్రాయాలు కలుగుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మరింత  గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన ఉద్యోగప్రాప్తి ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో  ఆలయ దర్శనాలు చేసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.ఉద్యోగమున మీప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి  చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు  వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

    డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
 

Follow Us:
Download App:
  • android
  • ios