డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు వ్యాపార సంస్థలను విస్తృతం చేయడానికి తీసుకునే చర్చలు లాభిస్తాయి. అన్నింటికీ ధనమే మూలమని నిరూపించే విధంగా సంఘటనలు చోటు చేసుకుంటాయి. వివాదాలలోకి మిమ్మల్ని లాగే ప్రయత్నాలు కొనసాగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పట్టువిడుపు ధోరణిని కనబరుస్తారు. క్రయవిక్రయాలలో జాగ్రత్తగా మెలుగుతారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. ఎదుటి వారు చెప్పేది ఆశాంతం ప్రశాంతంగా వింటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు  వృత్తి వ్యాపారాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. గతంలో దూరమైన వర్గం తిరిగి చేరువవుతారు. దైవదర్శనం చేసుకుంటారు.టెండర్లు, జాబ్‌ వర్క్స్‌, ఎగుమతి ఆర్డర్లు అనుకూలిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ఆంతరింగిక చర్చలు జరిగేచోట కొత్త వారికి ప్రవేశం కల్పించకండి. సహోదర, సహోదరీ వర్గానికి మీ వంతు సహాయ, నహకారాలను అందిస్తారు. ఆశించిన బుణాలు మంజూరవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఉన్నత విద్యావకాశాలపైన దృష్టిని సారిస్తారు. దీర్ఘాలోచనలు చేస్తారు. లిఖిత వూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చర్యలను చేపడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వ్యాపారులు మెలకువతో వ్యవహరించడం మంచిది. కీలక విషయాలలో స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. చతురోక్తులతో కూడిన సంభాషణలు సాగిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. చందనంతో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేయండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. వీసా, పాస్‌పోర్ట్‌ వంటి అంశాలు సానుకూల పడతాయి. ధరఖాస్తులను పంపేటప్పుడు ఒకటికి రెండు మార్లు పరిశీలించుకోవడం ఉత్తమం.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు దూర ప్రాంతాల్లోని ఆత్మీయులతో సంభాషణలు సాగిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సందర్భోచితంగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు  సంతాన విషయంలో అధిక శ్రద్ధను కనబరుస్తారు. న్యాయంగా మీకు రావాలసిన ధనం చేతికందుతుంది. విదేశీయానం ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవ సందర్శనం చేనుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మీ వైఖరిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు లాభాలు కలిసి వస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు కీలక విషయాలలో జీవితభాగస్వామి సహాయ నహకారాలను అందుకుంటారు. జాయింట్‌ ఖాతాలను ప్రారంభిస్తారు. సంభాషణలు, చర్చలు, సంప్రదింపులతో క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీ అంచనాలు చాలా వరకు నిజమవుతాయి. విధానపరమైన ముఖ్య విషయాలు సానుకూలపడతాయి. ఆర్థికలావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.