Asianet News TeluguAsianet News Telugu

today astrology: 22 మే 2020 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. ప్రణాళికలు ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం అవసరం. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలోచన అవసరం అవుతుంది.

today dinaphalithalu 22nd may 2020
Author
Hyderabad, First Published May 22, 2020, 6:57 AM IST

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) : మధ్యవర్తిత్వాల వల్ల ఒత్తిడి కలుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయలేరు. నిల్వ ధనం తగ్గిపోతుంది.  కుటుంబంలో అనుకూలత తగ్గుతుంది. వాక్దానాలు చేయడం తగ్గించుకోవాలి. మాట విలువ పెంచుకునే ప్రయత్నం అవసరం. గంభీరంగా మాట్లాడకూడదు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. ప్రణాళికలు ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం అవసరం. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఆలోచన అవసరం అవుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతి తగ్గుతుంది. ప్రయాణాలు అధికారికంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. వైద్యశాలల ఖర్చులు అధికం అవుతాయి. పాదాల నొప్పులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆదరణ లభిస్తుంది. ఆదర్శవంతమైన జీవితం కోసం సమయం వెచ్చిస్తారు. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ, కష్టం పడతారు. శ్రమకు తగిన గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారుల ఆదరణకోసం ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవం కోసం పాటుపడతారు. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి ఉంటుంది. అధికారిక ప్రయాణాల్లో లోటుపాట్లు ఉంటాయి. అధికారులకు శ్రమ ఎక్కువౌవుతుంది. ఉన్నోతద్యోగులతో సహనంగా వ్యవహరించాలి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విద్యార్థులకు తొందరపాటు పనికిరాదు. పరిశోధకులకు కొంత శ్రమ అధికం అవుతుంది. పరిశోధనలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తమకంటే ఉన్నతమైన వారితో స్నేహశీలంగా వ్యవహరించే అలవాటు చేసుకోవాలి. అన్ని పనుల్లోనూ సంతృప్తి తక్కువగా ఉంటుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాలలో ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. అత్యవసర సమయంలో మాత్రమే ప్రయాణం అవసరం. పరామర్శలు చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. ఊహించని ఒత్తిడి వచ్చే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సామాజిక అనుబంధాలు బలపరుచుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయస్తులను పెంచుకునే ప్రయత్నం. పాత సంబంధాలు మెరుగుపడే సూచనలు. కొత్తవారితో ఆచి, తూచి వ్యవహరించాలి. భాగస్వాములతో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం అత్యవసరం. శ్రమకు తగిన ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. పనులలో తొందరపాటు పనికిరాదు. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణ సంబంధ ఆలోచనలు ఫలిస్తాయి. ఎ:తకష్టమైనా భరించి పనులు పూర్తి చేస్తారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అధికారులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంతాన సంబంధ ఆలోచనల్లో తొందరపడి నిర్ణయాలు పనికిరావు. క్రియేటివిటీ తగ్గుతుంది. పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఘర్షణ వాతావరణం తగ్గించుకోవాలి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేస్తారు. సౌకర్యాలు అనుకున్నంత తొందరగా సమకూరవు. విద్యార్థులకు కొంత శ్రమ ఒత్తిడి అవసరం అవుతాయి. అన్ని పనుల్లో అలజడి ఏర్పడుతుంది. ఇంటి సంబంధ పనులు వాయిదా వేసుకోవాలి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారిక పరిచయాలు పెంచుకునే అవకాశం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి.  రచయితలకు కొంత ఒత్తిడితో కూడుకున్న సమయం. ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. అధికారుల సహాయ సహకారాలు లాభిస్తాయి. సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

దిన ఫలితాలు 23.5.2020

డా. ఎస్. ప్రతిభ.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్‌ చాతుర్యం తగ్గుతుంది. మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో గౌరవ హాని ఏర్పడుతుంది. నిల్వధనంపై దృష్టి పెరుగుతుంది. కిం సంబంధ లోపాలు పెరగే ఆలోచన. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. సంపాదనకు ప్రయత్నం. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ అధికం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కార్యసాధనలో పట్టుదల ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికా రూపకల్పన చేస్తారు.  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం. నిత్యావసర ఖర్చులు పెరుగుతాయి. అన్నివిధాల ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దేహసౌఖ్యం లోపిస్తుంది. సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి ఆసక్తి పెరుగుతుంది. స్త్రీల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తి చేస్తారు. సంఘవ్యవహారాల్లో అనుకూత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : వృత్తిలో సంతోషం. అధికారులతో అనుకూలత. అధికారిక ప్రయాణాలు. అధికార సంబంధ సంతృప్తి ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. రాచకార్యాలపై దృష్టి పెరుగుతుంది. పెద్దలంటే గౌరవం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విహార యాత్రలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన. ఆహారంలో జాగ్రత్త అవసరం. శాస్త్ర విజ్ఞానం పెంచుకునే ప్రయత్నం. దూరదృష్టి ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం. శ్రమలేనిఆదాయంపై దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు. ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాల్లో అనుబంధాల్లో అనుకూలత. భాగస్వాములతో సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పదిమందిలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారు జపం ముఖ్యం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ అధికం. గుర్తింపు లభిస్తుంది . పోటీల్లో ఒత్తిడితో గెలుపు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ ఆలోచనలు తీరుతాయి. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువ. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. ఆత్మీయత తక్కువ అవుతుంది. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. సంతృప్తి తక్కువ ఉంటుంది. సృజనాత్మకత లోపిస్తుంది. కళాకారులకు అనుకూలం. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాలవల్ల ఒత్తిడి. సుఖం కోసం ఆలోచిస్తారు.  మాతృసౌఖ్యం లోపిస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఉంటుంది.  విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీల ద్వారా సహకారం లభిస్తుంది. పరామక్రమం ఉంటుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. సంభాషణలు అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్స్‌ వల్ల సంతృప్తి ఏర్పడుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

Follow Us:
Download App:
  • android
  • ios