today astrology: 20 జూన్ 2020 శనివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెద్ద ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు.  తరులపై ఆధారపడతారు. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

today dinaphalithalu 20th june 2020

 డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతికై ఆలోచన పెరుగుతుంది. అనవసర ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో చి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు. అనవసర ఖర్చులు చేస్తారు.వాక్‌ చాతుర్యం తగ్గుతుంది. మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో గౌరవ హాని ఏర్పడుతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్ద ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు.  తరులపై ఆధారపడతారు. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ ముఖ్యం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అధికారులతో అనుకూలతకోసం ప్రయత్నిస్తారు. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. కీర్తిప్రతిష్టలపై ఆలోచన. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దేహసౌఖ్యం లోపిస్తుంది. సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. పరిశోధకులకు కొంత కష్టకాలం. శాసనకర్తలుగా వ్యవహరిస్తారు. అధికార వ్యవహారాలు చేస్తారు. స్త్రీల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తి చేస్తారు. సంఘవ్యవహారాల్లో అనుకూత ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. పరామర్శలు అవుతాయి. లాభాలు దుర్వినియోగం అవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవాలి. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. రాచకార్యాలపై దృష్టి పెరుగుతుంది. పెద్దలంటే గౌరవం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక ఒత్తిడి పెరుగుతుంది. నూతన పరిచయస్తులతో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. పాత స్నేహితులను దర్శించే ఆలోచన ఉంటుంది.  ఆహారంలో జాగ్రత్త అవసరం. శాస్త్ర విజ్ఞానం పెంచుకునే ప్రయత్నం. దూరదృష్టి ఉంటుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపుకు సాధన చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆచి, తూచి వ్యవహరిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైద్యశాలల సందర్శనం. శ్రమలేనిఆదాయంపై దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు. ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాల్లో అనుబంధాల్లో అనుకూలత. భాగస్వాములతో సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పదిమందిలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ అధికం. గుర్తింపు లభిస్తుంది . పోటీల్లో ఒత్తిడితో గెలుపు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ ఆలోచనలు తీరుతాయి. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువ. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. ఆత్మీయత తక్కువ అవుతుంది. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. సంతృప్తి తక్కువ ఉంటుంది. సృజనాత్మకత లోపిస్తుంది. కళాకారులకు అనుకూలం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సౌకర్యాలవల్ల ఒత్తిడి. సుఖం కోసం ఆలోచిస్తారు.  మాతృసౌఖ్యం లోపిస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఉంటుంది.  విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీల ద్వారా సహకారం లభిస్తుంది. పరామక్రమం ఉంటుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. సంభాషణలు అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్స్‌ వల్ల సంతృప్తి ఏర్పడుతుంది. ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios