Asianet News Telugu

today astrology: 19 జులై 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ లభించే సూచనలున్నాయి. స్వతంత్ర నిర్ణయాలను తీసుకుంటారు.

today dinaphalithalu 19th july 2020
Author
Hyderabad, First Published Jul 19, 2020, 7:32 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :-  ఈ రోజు మనోధైర్యంతో అనుకున్నదిసాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వస్తువులను గానీ, నగలను గానీ ఇచ్చిపుచ్చుకుంటారు. పనులు సాఫీగా జరుగుతాయి. వృత్తిలో మీరు ఆశించిన మార్పులను పూర్తి స్థాయిలో తీసుకురావడానికి మరితం కష్టించాల్సి వస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంటుంది. వస్త్ర, ధన లాభాలున్నాయి. రహస్య ఒప్పందాలను చేసుకుంటారు. వ్యాపారపరమైన పురోగతి బాగుంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విచారణలు, సంప్రదింపులు, సంభాషణలు మొదలైనవి అనుకూలిస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు నూతన, వస్తు వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగండి. అనవసర కలహలకు దూరంగా ఉండండి. విదేశీ సంబధిత అంశాలు లాభిస్తాయి. నిదానమే ప్రధానమన్న ఆర్యోక్తి ఎంతైన అవసరం. వృత్తి, ఉద్యోగాల పట్ల మీరు చూపే శ్రద్ధ సత్ఫలితాలను అందిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు  మంచి భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించిన ఫలితాలు ఉన్నాయి. టీమ్ వర్క్ ను టీం స్పిరిట్ తోనే పూర్తి చేస్తారు. వైజ్ఞానిక రంగంలో పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఓ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది. సభలు, సమావేశాలకు గాను ఆహ్వానాలను అందుకుంటారు. ఉద్యోగంలో స్థాయి పరపతి పెరుగుతుంది. కండరాలకు, కీళ్లకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రత్యర్థి వర్గం బలపడుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. తాత్కాలిక ప్రయోజనాలు కొరకు అందరితో కలిసి పనిచేయుట తప్పకపోవచ్చు. సంతోషాన్ని కలిగి ఉంటారు. పెద్దల సలహాలను పాటిస్తారు. జాగ్రత్తగా మెలుగుతారు. చికాకులు ఏర్పడవు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు శుభప్రదమైన చర్చలను, ప్రసంగాలను సాగిస్తారు. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫిలితాన్నిస్తున్నాయి. వ్యతిరేక వర్గాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. విదేశీ సుదూర ప్రాంత లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరమైన సర్దుబాట్లు నేర్పుగా చేయగలుగుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు శుభప్రదమైన చర్చలను ప్రసంగాలను సాగిస్తారు. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార, వృత్తి వ్యవహారాలు క్షణం తీరిక లేకుండా చేస్తాయి. ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడే వారి వల్ల మీకు చికాకు ఏర్పడుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. ఉన్నత విద్యావకాశాలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో సమాలోచనలు సాగిస్తారు. అగ్రిమెంట్స్, కాంట్రాక్టులు, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలకు అనుకూలమైన కాలంగా పరిగణిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. రాజకీయాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ శ్రమ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు సదవకాశాలు లభిస్తాయి. అభిమాన బృందంతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు దైవదర్శనం చేసుకుంటారు. ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ లభించే సూచనలున్నాయి. స్వతంత్ర నిర్ణయాలను తీసుకుంటారు. ఎలక్ట్రానికి పరికరాలను కొనుగోలు చేస్తారు. అమ్మవారి దర్శనం చేసి అర్చన చేయండి శుభం కలుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. విధుల నిర్వహణలో మీరు చూపే శ్రద్ధ పలువురి ప్రశంసలు అందుకుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆత్మీయుల తోటి సంభాషణలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios