Asianet News TeluguAsianet News Telugu

Horoscope Today: ఓ రాశివారికి ధనప్రాప్తి, ప్రముఖులతో పరిచయం..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు సన్నిహితుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. 

Today Dinaphalithalu 18th January 2022
Author
Hyderabad, First Published Jan 18, 2022, 9:17 AM IST

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు నిరుద్యోగులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు సన్నిహితుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగయోగం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనాలు కొంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు నిర్ణయాలలో మార్పులు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు  కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. చర్చలు సఫలం. సోదరులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు వ్యవహారాలలో ఆటంకాలు.బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్న సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒడిదుడుకులతో సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
 


 

Follow Us:
Download App:
  • android
  • ios