Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 16 ఫిబ్రవరి 2021 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. బాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. 

today dinaphalithalu 16th feb 2021
Author
Hyderabad, First Published Feb 16, 2021, 7:03 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 16th feb 2021

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పనుల్లో ప్రతిష్ఠంభన ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు తీరతాయి. బాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిత్రమైన సంఘటనలు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. అర్థిక ఇబ్బందులు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనప్రాప్తి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవచింతన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు బంధువులతో స్వల్ప విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. భూలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios