Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 15 డిసెంబర్ 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. 

today dinaphalithalu 15th december 2020
Author
Hyderabad, First Published Dec 15, 2020, 7:02 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 15th december 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు దూరప్రయాణాలు . ఆరోగ్య, కుటుంబసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరాశ. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. సన్నిహితులు, మిత్రులతో  విభేదాలు.  ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో  లాభాలు కష్టమే. ఉద్యోగాలలో పనిభారం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు చిరకాలమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని పురోగతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ధనలాభం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు పనుల్లో  అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక విషయాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటì  మిత్రులతో  సఖ్యత. ఉద్యోగాలు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. ఆధ్యాత్మిక చింతన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు పనులు కొన్ని మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios