ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఊహించని ఇబ్బందులు ఎదురౌతాయి. పరామర్శలు చేస్తారు. పెద్దవారికి, గురువులకు సేవచేసుకునే అవకాశం లభిస్తుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనుకోని ఖర్చులు వచ్చే సూచనలు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆచి, తూచి వ్యవహరించాలి.

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్వినిభరణికృత్తిక 1వపాదం) :ఆధ్యాత్మిక యాత్రలపై ఆలోచన ఉంటుంది. దేవాలయాల సందర్శనం వైపు మొగ్గు చూపుతారు. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకున్న పనులు పూర్తి చేసే సమయం. గౌరవం కోసం ఆరాట పడతారు. పరిశోధకులకు అనుకూలమైన సమయం. పరిశోధనలపై ఆసక్తి పెరుగతుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలురోహిణిమృగశిర 1,2పాదాలు) :ఊహించని ఇబ్బందులు ఎదురౌతాయి. పరామర్శలు చేస్తారు. పెద్దవారికి, గురువులకు సేవచేసుకునే అవకాశం లభిస్తుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనుకోని ఖర్చులు వచ్చే సూచనలు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆచి, తూచి వ్యవహరించాలి.

మిథునం :(మృగశిర 3,4పాదాలుఆర్ద్రపునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో గౌరవం పెంచుకుంటారు. భాగస్వాములతో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. పెద్దలతో, గురు సంబంధమైన వారితో మాటలు కలుస్తాయి. నూతన పరిచయాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష) : పోటీల్లో గెలుపుకై పరితపిస్తారు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆరాట పడతారు. అప్పుల గురించి ఆలోచన పెరుగుతుంది. శత్రువులపై విజయానికి పరితపిస్తారు. పొట్ట సంబంధ వ్యాధులు సుఖ వ్యాధులు బయటపడే అవకాశం. లోప నివారణ చేసుకోవడం మంచిది.

సింహం (మఖపుబ్బఉత్తర 1వ పాదం) : సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. చిత్త చాంచల్యం కోల్పోతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఏ పని చేసినా ఒకసారి ఆలోచన చేసి కాని పనులు ముందుకు సాగనీయరు. సంతానంతో సంతోషంగా ఉంటారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలుహస్తచిత్త 1,2 పాదాలు) :సౌకర్యాలపై ఆలోచన పెరుగుతుంది. దాని వలన ఒత్తిడి పెంచుకుంటారు. ప్రయాణాల్లో ప్రమాదాలకు అవకాశం. ఇంటి సంబంధ పనులలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1,2,3పాదాలు) : పెద్దల సహకారం లభిస్తుంది. గౌరవంతో పనులు పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. రచనలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలమైన సమయం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ) :  మాట విలువ పెరుగుతుంది. వాక్ చాతుర్యంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో అనుబంధాలు మెరుగుపరచుకుంటారు. నిల్వ ధనాన్ని పెంచుకునే సమయం. మధ్యవర్తిత్వాలు పనిచేస్తాయి. గౌరవ మర్యాదలు పెంచుకునే సమయం.

ధనుస్సు :(మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకునే సమయం. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడినితగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఊహించని ఇబ్బందులు వస్తాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణంధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. విశ్రాంతికోసం ఆరాట పడతారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. దైవాలయాల దర్శనాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న డబ్బులు సద్వనియోగం చేస్తారు.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3పాదాలు) : లాభాలు సద్వినియోగం అవుతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నిర్ణయాలు తీసుకునే రోజు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనులఒత్తిడి తగ్గుతుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదంఉత్తరాభాద్రరేవతి) : అధికారులతో అనుకూలత పెంచుకుంటారు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. గౌరవంతో బ్రతకాలనే ఆలోచన ఉంటుంది. గౌరవహానిని తట్టుకోలేరు. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. సంఘంలో హోదా కావాలనుకుంటారు.