Asianet News TeluguAsianet News Telugu

today astrology: 13 ఆగస్టు 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉత్సాహంగా పని చేస్తే తప్ప పనులు పూర్తి కావు. న్యాయంగా మీకు రావాల్సిన ధనాన్ని అందుకోగలుగుతారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు.  

today dinaphalithalu 13th august 2020
Author
Hyderabad, First Published Aug 13, 2020, 7:10 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 13th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. మనః సౌఖ్యం కలదు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహ సంబంధిత విషయాల పట్ల దృష్టిని సారిస్తారు. సులభంగా కావాలసిన పనులకు ప్రయాస పడాల్సి ఉంటుంది. దీర్ఘాలోచనలు సాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు పర్యావేక్షణ లోపం లేకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు వహించండి. మిశ్రమ వాతావరణం కలదు. ఉత్సాహంగా పని చేస్తే తప్ప పనులు పూర్తి కావు. న్యాయంగా మీకు రావాల్సిన ధనాన్ని అందుకోగలుగుతారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు సామాజిక సేవా కార్యక్రమాలు గాను చందాలు వసూలు చేస్తారు. కళా సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు. చర్చలు ఫలిస్తాయి. ప్రజా సంబంధాలు మరింతగా వృద్ధి చెందుతాయి.  ప్రయత్న కార్యానుకూలత ఉన్నది. అభివృద్ధి కోసమే చేసే పనులు సఫలీకృతమై ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు వ్యాపారాభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి-చెడులను ఆలోచించి ముందుకు సాగండి. అవసరాలకు సరిపడా ధనాన్ని కలిగి ఉంటారు. దూరప్రాంతంలో నివసిస్తున్న మీ వారి యోగ క్షేమాలను తెలుసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు చేపట్టే పనులు, ప్రారంభించే వ్యవహారాలకు ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. వాస్తవిక ప్రామాణికంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆహార ఆరోగ్య నియమాల పట్ల దృష్టి సారించడం మంచిది. లాభనష్టాలను బేరిజు వేసుకుని నిర్ణయాలను తీసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఒత్తిడిని తగ్గించుకోవడానికి గాను బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారు. శుభకార్య చర్చలను సాగిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. మానసికంగా చంచల స్వభావాన్ని వీడండి. దేవాలయాలను సందర్శిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధుప్రీతి ఉంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకోండి. దురలవాట్లకు స్వస్తి చెబుతారు. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో చురుకుదనాన్ని తీసుకువస్తారు. లౌక్యంగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూల పరుచుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ముఖ్యమైన బరువు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. నూతన పంథాలో వినూత్న వ్యూహాలను అమలు పరుస్తారు. ఆత్మ విమర్శ చేసుకుంటారు. నిజాయితీగా వ్యవహరిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు మీ అభిప్రాయాలతో రాజీ ధోరణి ఏర్పడుతుంది. కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. ప్రత్యర్థి వర్గం మీ కన్నా బలహీనంగా ఉండటం లాభిస్తుంది. రహస్య సమాచారం వెలుగు చూస్తుంది. లక్ష్యాలను చేరుకోవాలంటే బాగా కృషి చేయాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు  శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారంలో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు మీకు ఎంతమాత్రం సంబంధం లేని విషయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన. ప్రయాణాల్లో మెలకువ అవసరం. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు అధికారులతో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. చిన్నపాటి వివాదాలను ఆదిలోనే పరిష్కరించుకుంటారు. వినోద కార్యక్రమాల ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios