Asianet News TeluguAsianet News Telugu

today astrology: 12 ఆగస్టు 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శ్రమ పెరుగుతుంది. అదికారులతో జాగ్రత్త అవసరం. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రహస్య చర్చలు మంతనాలను సాగిస్తారు.

today dinaphalithalu 12th august 2020
Author
Hyderabad, First Published Aug 12, 2020, 7:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 12th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు  అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. సహోదర, సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సాకారాలు అందిస్తారు. స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపిస్తారు. ఇది లాభించే అంశం కాదు. ఓ శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. శ్రమ పెరుగుతుంది. అదికారులతో జాగ్రత్త అవసరం. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రహస్య చర్చలు మంతనాలను సాగిస్తారు. ప్రముఖుల అండదండలతో అతి కీలకమైన వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. పరాధాన్యత కలిగినటువంటి బాధ్యతలను నిర్వహిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు సొంతవర్గాన్ని బలోపేతం చేసుకునే చర్యలను ముమ్మరం చేస్తారు. చేపట్టే పనులు, వ్యవహారాల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకులంగా ముందుకు సాగాలి. మిత్రులు లేదా బంధువులకు కొంత ధనాన్ని రుణంగా ఇస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిణమించే సూచనలున్నాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడుతాయి. నిష్కారణమైన కలహాలు, వివాదాలు పరిష్కరించుకోవడానికి మౌనంగా ఉండటమే మంచిది. కుటుంబ సభ్యుల సహాయ సాకారాలు అండదండగా నిలుస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు చెల్లింపులను సకాలంలో చెల్లించుకోగలుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆవేశాని కన్నా ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తారు. ఎవరినీ నొప్పించకుండా జాగ్రత్తగా మసులుకుంటారు. రుణం ఇవ్వడం, తీసుకోవడం రెండూ కలిసి రావు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు శుభ ఫలితాలున్నాయి. ఆశ్తిని వృద్ధిచేసే క్రమంలో సఫలీకృతులవుతారు. కష్టసాధ్యమైన పనులను కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. వాగ్వివాదాలకు చోటు కల్పించరు. వ్యాపారస్తులకు అనుకూలం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ఆర్థిక ప్రగతిని సాధించడానికి చేపట్టే చర్యల్లో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించండి. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉండండి. వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలు సానుకూల పడే సూచనలున్నాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఉన్నత స్థాయి వర్గం వారు కూడా మీ సలహాలను, సూచనలను పాటిస్తారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థి వర్గంపై విజయం సాధిస్తారు. వీసా, పాస్ పోర్ట్ వంటి అంశాలు కలిసి వస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు స్థిరాస్తుల తాలుకూ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. చాలా వరకు అనేక విషయాలు మీ కనుసన్నల్లో నడుస్తున్నట్లుగా భావిస్తారు. వాహన యోగ సూచన ఉంది. వినూత్నంగా ఆలోచనలు సాగిస్తారు. మాధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. గౌరవప్రదమైన స్థానంలో వారితో సత్సంబంధాలు మరింతగా బలపడతాయి. బహుమతులు అందుకుంటారు. మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులను పెడతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. దైవానుగ్రహం రక్షిస్తున్నట్లు భావిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాలు ఆలస్యమవకుండా చూసుకోవాలి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios