Asianet News TeluguAsianet News Telugu

today astrology: 11 ఆగస్టు 2020 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మంచి ప్రోత్సాహం లభిస్తుంది. సకాలంలో స్పందించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. 

today dinaphalithalu 11th august 2020
Author
Hyderabad, First Published Aug 11, 2020, 7:02 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 11th august 2020

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సాయంతో ఓ పని పూర్తి చేస్తారు. స్నేహితుల కూటమిలో కొత్తవారిని చేరుస్తారు. సమష్ఠిగా నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. లిఖిత పూర్వక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మంచి ప్రోత్సాహం లభిస్తుంది. సకాలంలో స్పందించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. అస్తవ్యస్థంగానున్న చాలా వ్యవహారాలను మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కదిద్దుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తి కాని ఓ పని ఇప్పుడు పూర్తవుతుంది. భవిష్యత్తులో ఉపకరించే అంశాలపైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. వాహనం మార్పు చేసే సూచనలు ఉన్నాయి. విలువైన పత్రాలను అందుకుంటారు. ఆహార నియమాలను పాటిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు మీ మీ రంగాల్లో మాధ్యమ ఫలితాలున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కృత్రిమంగా ఏర్పడే చికాకులు స్వల్పంగా ఇబ్బందిని కలిగిస్తాయి. గృహ మరమ్మత్తులు సాగిస్తారు. మాయ మాటలతో మిమ్మల్ని మోసపుచ్చేవారు మీ దగ్గరలోనే ఉంటారు. జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు వైద్యుని మార్పు చేస్తారు. స్వల్ప ధనలాభ సూచన ఉంటుంది. చేపట్టే పనులు విజయాన్నిస్తాయి. బంధు ప్రీతి ఉంటుంది. నత్త నడకన సాగుతున్న పనుల్లో చురుకుదనం తీసుకురావడానికి విశేషంగా శ్రమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నేడు అనుకూలం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటారు. కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి. ముందు జాగ్రత్తలతో వ్యవహరిస్తారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఉన్నతమైన భావాలను కలిగి ఉంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు కీలక విషయాల్లో శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించండి. రాజీ లేని ధోరణిని కనబరుస్తారు. ధనం కంటే ధర్మమే ముఖ్యమని భావిస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆత్మీయులను మందలిస్తారు. వాహన సంబంధమైన విషయాలు ప్రతికూలంగా ఉంటాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు సంతృప్తిని అలవరచుకుంటే జీవితం సుఖమయమవుతుంది. పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఆశ్చర్యం కలిగించే సమాచారాన్ని తెలుసుకుంటారు. అపాత్రదానం చేస్తారు. దుష్టచారాలను సమర్థవంతంగా తిప్పికొడతారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. పనుల యందు ఆటంకాలు కలుగుతాయి. మీ పైన నిష్కారణమైన ఈర్ష్యా, ద్వేషాలు అధికమవుతాయి. చిక్కిన ధనం చేతికందుతుంది. బంధువుల నుంచి శుభవార్తలను అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మీ అధికార పరిధిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఓర్పు, సహనం కలిగి ఉండటం చెప్పదగిన సూచన. ఖర్చులు మితిమీరి ఉంటాయి. రావిచెట్టునకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం స్థిరంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు కొత్తకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.  సాంకేతిక రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వాస్తవాలను పరిశీలించి వాటి ప్రాతిపాదికన నిర్ణయాలను తీసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు శ్రమ అధికంగా ఉండటం వల్ల ఒత్తిడిని కలిగి ఉంటారు. రుణ సంబంధమైన విషయాల నుంచి ఊపిరి పీల్చుకోగలుగుతారు. ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలున్నాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయోజనాలను పదిలంగా పరిరక్షించుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios