Asianet News TeluguAsianet News Telugu

today astrology: 01 సెప్టెంబర్ 2021 రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధువులతో విరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. 

today dinaphalithalu 01st september 2021
Author
Hyderabad, First Published Sep 1, 2021, 7:15 AM IST

 

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు చేపట్టిన  పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు బంధువులతో విరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. పనులలో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాల్లో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు అనుకోని సంఘటనలు. విలువైన వస్తువులు జాగ్రత్త.. ఆప్తులతో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగాల్లో సమస్యలు తీరతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా. మిత్రులతో కలహాలు. కొన్ని విషయాల్లో అంచనాలు తప్పుతాయి. ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు అధికం. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనయోగం. సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి పోస్టులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios