Asianet News TeluguAsianet News Telugu

Horoscope Today: ఓ రాశివారికి వస్తు, వాహన యోగం..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పనులు మధ్యలోవాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం

Today dinapahlitahlu 14th january 2022
Author
Hyderabad, First Published Jan 14, 2022, 4:48 AM IST

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి మార్పులు. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతమిత్రుల కలయిక. వాహనాలు కొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పనులు మధ్యలోవాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు సన్నిహితుల నుంచి ధనలాభం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిగా మారతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనయోగం. సోదరులతో సఖ్యత. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు విస్తరించడంలో పొరపాట్లు. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

 

 

Follow Us:
Download App:
  • android
  • ios