Asianet News TeluguAsianet News Telugu

ఈరోజురాశిఫలాలు: ఓ రాశివారికి శుభవార్తా శ్రవణం, విందు భోజనం

ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. .ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.

Today Dina Phalithalu of 22nd March 2023
Author
First Published Mar 22, 2023, 5:06 AM IST

 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:     
 
తేది :   22 మార్చి  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం  . చైత్రం
ఋతువు : వసంత ఋతువు 
పక్షం :   శుక్ల పక్షము                                                                                  
వారము: బుధవారం
తిథి :   పాడ్యమి రాత్రి 9.55 ని వరకు
నక్షత్రం :   ఉత్తరాభాద్ర సాయంత్రం 4.58ని వరకు 
వర్జ్యం:   తె.4.35 నిల 6.08ని  వరకు
అమృత ఘడియలు:మధ్యాహ్నం 12.31.నిల 1.55 ని   వరకు
దుర్ముహూర్తం:మ.11.43ని. నుండి మ.12.30ని. వరకు.            
రాహుకాలం:మ.12.00ని.నుండి మ.01.30ని.వరకు
యమగండం:ఉ.07.30ని. నుండి ఉ.09.00ని. వరకు
ఉగాది

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయిక. సంఘమునందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. మానసికంగా శారీరకంగా బలపడతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో లాభాలు. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఏ రాశి వారు ఓం రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సంతాన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. గృహమునందు ప్రతికూల వాతావరణం. చెడు స్నేహాల వలన కొత్త సమస్యలు ఏర్పడును. ఉద్యోగం నందు పై అధికారుల వలన చికాకులు. . వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. సంతాన మూలకంగా లాభాలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. .ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. ఈరోజు ఈ రాశి వారు ఓం గౌర్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆదాయానికి మించిన ఖర్చులు. మానసిక ఆందోళన. శారీరక శ్రమ అధికంగా ఉండును.  ఇతరుల విషయంలో జోక్యం తగదు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. మీ యొక్క శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు. వినరాని విషయాలు వినవలసి వస్తుంది. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకు గురి అవుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను . ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో ఊహించినటువంటి అధికారుల ఒత్తిడిలు పెరుగును.వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కొంతమేర రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందం

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉండును. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యముగా అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా ఉండను. ఉద్యోగ ప్రయత్నంలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక అవసరాలను బట్టి ఖర్చు చేయవలెను. నీచ జన సహవాసము దురాలోచనలకు దూరంగా ఉండుట మంచిది. మనసునందు ఆందోళనగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.  కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. మొండి బాకాయలు వసూలు అగును. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.  ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి వివాదాలు తీరి అనుకూలమైన లాభాలు పొందుతారు. సంతాన అభివృద్ధికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు మహాలక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభం. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఉద్యోగం నందు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.. చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు .  సంఘమునందు తెలివిగా వ్యవహరించడం వలన మీ పనులు సజావుగా సాగును.  ఆర్థికంగా బలం చేకూరుతుంది. .  సంతాన మూలకంగా లాభాలు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం వాచస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
శుభవార్తలు వింటారు.స్తంభించిన పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో పై అధికారులు ఆదర అభిమానాలు పొందగలరు. మిత్రుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ధన లాభాలు. . అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం పరమేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఉద్యోగం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది.. చేపట్టిన పనులను పట్టుదల తోటి త్వరితగతిన పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండవలెను. . చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది.  సంఘమునందు తెలివిగా వ్యవహరించండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. శ్రమాధిక్యం. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ఈరోజు ఈ రాశి వారు


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధన లాభం. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి.  అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు మార్గాలు అన్వేషించండి. శారీరిక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండును. ఈరోజు ఈ రాశి వారు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చెబుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. . వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు.  ప్రయాణాల్లో నూతన మిత్రులు కలయిక. గృహమునకు కావలసిన సామాగ్రి సమకూర్చుకుంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Follow Us:
Download App:
  • android
  • ios