Asianet News TeluguAsianet News Telugu

Today Astrology: ఓ రాశివారికి ధనాదాయం పెరుగుతుంది..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం.  ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. 

Today Dina Phalithalu 21st May 2022
Author
Hyderabad, First Published May 21, 2022, 4:45 AM IST

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 
 
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-  

 అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. సుబ్రహ్మణ్య ఆరాధన చేసినా శుభం జరుగును 

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

చేయు పనులయందు ఆలస్యం. అకారణంగా కోపం. వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణబాధలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం.బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. సూర్యారాధన చేసిన శుభం జరుగును.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. శివ ఆరాధన చేసిన శుభం జరుగును.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణబాధలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యం.అకారణంగా కోపం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన శుభం జరుగును.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

అవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. పనులు అనుకున్న రీతిలో పూర్తి. సంఘంలో విశేష ఆదరణ. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. దుర్గా ఆరాధన చేసిన శుభం జరుగును.


కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

అనవసరమైన ఆలోచనలు చేస్తారు. పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. కష్ట పడిన పనులలో ఫలితం లభించును. అనవసరమైన నిర్ణయాల వలన ఇబ్బందులు పడతారు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యాపారాల యందు సామాన్యం. అపనిందలు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన శుభం జరుగును.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మి ఆరాధన చేసిన శుభం జరుగును.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం.  కొత్త కార్యక్రమాలు చేపడతారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు.విష్ణు ఆరాధన చేసిన శుభం జరుగును.


ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం. గృహము నందు శుభకార్యములు.  కొత్త కార్యక్రమాలు చేపడతారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేసిన శుభం జరుగును.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

ఉద్యోగాలలో పదోన్నతులు. తలపెట్టిన పనులలో ఆలస్యం అయినా విజయం సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. అనుకోని ఖర్చులు. శ్రమాధిక్యం. అకారణంగా కోపం. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలం. ఆత్మవిశ్వాసం మనోబలంతో ముందుకు సాగండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబం నందు చిక్కులు. సూర్యారాధన చేసిన శుభం జరుగును.


కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. పలు విధాలుగా ధనాదాయం.ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.  స్థిరాస్తి అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో తగిన గౌరవం గుర్తింపు. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాలు. స్నేహితులకు సహయ సహకారాలు అందిస్తారు.

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం.  ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.రావలసిన బకాయిలు వసూలగును. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. శివారాధన చేసిన శుభం జరుగును.

పంచాగం
 
శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
బ.షష్ఠి రాత్రి 08:08ని‌.ల వరకు
ఉ.షాఢ నక్షత్రం ఉదయం 06:14ని|| వరకు
వర్జ్యం ఉ.10:00ని.ల లగాయతు ఉ.11:30ని.లవరకు     
దుర్ముహూర్తం ఉదయం 05:30ని. లగాయతు ఉ.07:12ని.ల వరకు
రాహుకాలం ఉ. 09:00ని.ల లగాయతు ఉ. 10:30ని.ల వరకు
యమగండం మధ్యాహ్నం 01:30ని.ల లగాయతు మ.03:00ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:30ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:22ని.లకు.

Follow Us:
Download App:
  • android
  • ios