7 సెప్టెంబర్ 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 7th spetember2018 your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాల వల్ల ఒత్తిడి. విద్యార్థులకు ఒత్తిడి కాలం. మాతృసౌఖ్యం లోపిస్తుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు పెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనుల్లో అలసత్వం వస్తుంది. సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి అధికం. దేవి స్తోత్రపారాయణ శ్రేయస్కరం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటా యి. సహకార లోపం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. లాభనష్టాలపై దృష్టి ఉంటుంది. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం.  ఆకస్మిక ఇబ్బందులు వచ్చే సూచన. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ఇతరులపై ఆధారపడతారు. లలితా ఆరాధన శ్రేయస్కరం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపాలు. నూతన పరిచయాల వల్ల ఇబ్బందులు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. పదిమందిలో పలుకుబడికోసం ఆరాటపడతారు. అధికారిక ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో జాగ్రత్త అవసరం. దేవి స్తోత్ర పారాయణలు శ్రేయస్కరంగా ఉంటా యి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. వాగ్దానాలు నెరవేరుతాయి. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య భావన. లలితా ఆరాధన శ్రేయస్కరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సృజనాత్మకత లోపం ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.  సంతాన సమస్యలు వచ్చే సూచన. విద్యార్థులకు పట్టుదల అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రణాళికా బద్ధమైన జీవితంకోసం ప్రయత్నిస్తారు. కార్యసాధనలో ఆటంకాలు. పట్టుదల అవసరం. లలితా ఆరాధన శ్రేయస్కరం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. సౌఖ్యలోపం ఉంటుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. విశ్రాంతి లోపం ఉంటుంది. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. విద్యార్థులకు కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సమస్యలు. లలితా ఆరాధన శ్రేయస్కరం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవకజన సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెంచుకుాంరు. మానసిక ఆలోచన అధికం. ఆధ్యాత్మిక చింతన పెంచుకునే ప్రయత్నం. సమిష్టి ఆదాయాలపై ఆలోచన చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. రాజకీయాలపై దృష్టి. లలితా ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాలు వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు వచ్చే సూచన. ఆర్థిక నిల్వలపై దృష్టి అధికం అవుతుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. లలితా సహస్రనామ పారాయణ, శ్రేయస్కరం.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికంగా చేయాలి. కార్యసాధనలో పట్టుదల అవసరం. ప్రణాళికాబద్ధమైన జీవితం సాగించాలి. శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన సజ్జన సాంగత్యం. విద్యార్థులకు అనుకూల సమయం. పరిశోధనలపై దృష్టి సారిస్తారు. లలితా సహస్రనామ పారాయణ, శ్రేయస్కరం.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు, భయాలు వస్తాయి. ఊహించని ఇబ్బందులు. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. అనారోగ్య భావన ఉంటుంది. వైద్యశాలల సందర్శనం. క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. లలితా సహస్రనామ పారాయణ శ్రేయస్కరం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సమిష్ఠి కృషిపై ఆలోచన. సమిష్టి ఆదాయాల సంపాదన. సామాజిక అనుబంధాల్లో అనుకూలత. భాగస్వాములకు కలిసివచ్చే కాలం. నూతన పరిచయాలు అభివృద్ధి చెందుతాయి. కళాకారులకు అనుకూల వాతావరణం. లలితా సహస్రనామ పారాయణ, శ్రేయస్కరం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : రాజకీయులకు అప్రమత్తత. అనవసర ఇబ్బందులు. అధికారులతో ఒత్తిడి. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం. సౌందర్య ఆరాటం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం. పరామర్శలు చేస్తారు. లలితా సహస్రనామ పారాయణ, శ్రేయస్కరం.

డా. ఎస్‌. ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios