Asianet News TeluguAsianet News Telugu

07 జూలై 2018 శనివారం.. మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 7th july your horoscope

మేషం

మేషం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవటం కానీ, నూతన వస్ర్తాలు కొనుగోలు చేయటం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండటం మంచిది. మీ జీవిత బాగస్వామి నుంచి అనుకోని సహాయం లభిస్తుంది.

వృషభం

వృషభం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడటం కానీ, ఇతరుల సాయం తీసుకోవటం కానీ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది. అనవసర ఖర్చులుంటాయి.

మిథునం

మిథునం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీరు కొనాలనుకున్న లేదా పొందాలనుకున్న వస్తువులు మీ చేతికి వస్తాయి. ఉద్యోగ విషయంలో అనుకోని విజయం కానీ, ప్రశంస కానీ పొందుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొలుగోలు చేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా నిరుత్సాహ పడకుండా పని చేస్తే విజయం సాధిస్తారు.

సింహం

సింహం: ఈ రోజు మీరు రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతిని కోరుకుంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మార్పు కోరుకుంటారు.

కన్య

కన్య :మానసికంగా కొంత అశాంతితో ఉంటారు. అనుకోని అవమానం ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం అవొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది.

తుల

తుల : వివాహ సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూల దినం. మీ మనసులోని భావాలను మీ జీవితభాగస్వామికి వ్యక్తం చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి వినోద కార్యక్రమాలకు వెళతారు. బంధువులతో లేదా మిత్రులతో ఉన్న గొడవలు సమసిపోతాయి.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన పాత బకాయిలు రావటం కాని, లోన్ రావటం కానీ జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపార విషయాలకు కొంత సామాన్యంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు

ధనుస్సు : ఈ రోజు ప్రేమను లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచటానికి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా కొంత ఆందోళన, ఉత్సాహం కలగలుపుగా ఉంటాయి. మీ సంతానం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, ఆర్థిక లావాదేవీలకు అంతగా అనుకూలమైన రోజు కాదు.

మకరం

మకరం : ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. ఇల్లు కొనటం లేదా నిర్మాణ సంబంధ పనులు, ఒప్పందాలు ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల, బంధువుల సహాయం అందుకుంటారు. విద్యా సంబంధ విషయాలలో మంచి ప్రగతి సాధిస్తారు. ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

కుంభం

కుంభం : ఈ రోజు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణం కానీ, అనుకోని మార్పు కానీ ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు మంచి సమాచారం అందుకుంటారు. మీ భావోద్యేగాలను కొంత అదుపులో ఉంచుకోవటం మంచిది.

మీనం


మీనం : ఈ రోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం. వాద వివాదాలకు తావివ్వకండి. ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం చేసే అవకాశముంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios