మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాల వల్ల అనుకూలత ఏర్పడుతుంది. మాతృసౌఖ్యం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ప్రాథమిక విద్యలపై దృష్టి పెరుగుతుది. వాహన సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కమ్యూనికేషన్స్‌ వల్ల కొంత ఆటంకం ఏర్పడుతుంది.  ఒత్తిడితో సౌకర్యాలు లభిస్తాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైన సమయంగా భావిస్తారు. పరామర్శలు చేస్తారు. చిత్త చాంచల్యం తగ్గుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మధ్యవర్తిత్వాలు అనుకూలిస్తాయి. కుటుంబ సంబంధాలు విస్తరించే సూచనలు ఉన్నాయి. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బంగారం కొనుక్కోవాలనే ఆలోచన పెరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులు కొంచెం ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. ఆలోచనలకు అనుగుణంగా పనుల రూపకల్పన చేస్తారు. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. మంచి ప్రయత్నం చేస్తారు. ఆశయాలు పూర్తిచేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. అనవసర ప్రయాణాలపైదృష్టి పెడతారు.   ఇతరులపై ఆధారపడతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సుఖం కోసం ఆలోచనలు పెరుగుతాయి. శారీరిక శ్రమను తప్పించుకోలేరు. విహార యాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శ్రమలేని సంపాదనపైదృష్టి పెడతారు. కళాకారులకు అనుకూల సమయం. ఆదర్శవంతంగా నిలబడాలనే ఆలోచన పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తిచేస్తారు. లాభాలు సంతృప్తినిస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తిలో అనుకూలతలు ఏర్పడతాయి.  చేసే ఉద్యోగంలో సంతోషం లభిస్తుంది. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కళాకారులకు కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకై ఆలోచన చేస్తారు. రాజకీయాలు ప్రభావితం చేస్తాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  పరిశోధనల వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు. నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది.  దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దలంటే గౌరవం, భయం ఏర్పడతాయి. సజ్జన సాంగత్యం చేసే ప్రయత్నం చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. పరామర్శలు ఉంాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. అనారోగ్య భావనలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. లాభనష్టాలు అనుకూలంగా ఏర్పడతాయి. క్రయవిక్రయాలు చేస్తారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు విస్తరిస్తాయి. వ్యాపార అనుబంధాలు పెరుగుతాయి. నష్టవస్తు పరిజ్ఞానం సంపాదించుకుాంరు. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. వాివల్ల లాభాలు చేకూరుతాయి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. రోగనిరోధక శక్తి పెంచుకుాంరు. ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అలంకారాలపై దృష్టి సారిస్తారు. వృత్తి విద్యలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులకు కొంచెం ఒత్తిడి సమయం. మానసిక సమస్యలు అధికంగా వచ్చే సూచనలు. ఆలోచనలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రియేివిీని పెంచుకుాంరు. పరిపాలన సమర్ధత ఉంటుంది. వ్యాపార ధోరణి, ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ