మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విద్యార్థులకు అనుకూల సమయం. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు.   శ్రమతో సౌకర్యాల సాధన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయపాలన అవసరం. సౌకర్యాల వల్ల సంతోషం కలుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వ్యాపారస్తుల సహకారం లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. పరామర్శలు చేస్తారు. ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నిల్వ ధనాన్ని పెంచుకోవాలనే ఆలోచన ఉంటుంది. స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వాక్‌ చాతుర్యం బావుంటుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. కిం సంబంధ దోషాలు పోతాయి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కష్టకాలం. పట్టుదలతో కార్యసాధన అవసరం. ఆలోచనలు బ్టి ప్రణాళికల్లో మార్పులు ఉంటాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అనవసర ఖర్చులు ఉంటాయి. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. నిద్రాభంగం ఉంటుంది. సుఖం కోసం ఆలోచిస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  వ్యాపారస్తులకు సమిష్టి ఆదాయాలు. అనుకూల సమయం. అన్నివిధాల లాభాలు వచ్చే అవకాశం. పెద్దల ఆశీస్సులుటాంయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చేప్టిన పనుల్లో కార్యసాధన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అధికారులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం. విద్యార్థులకు కష్టకాలం. ఉద్యోగస్తులు జాగ్రత్తపడే అవకాశం. పెద్దలంటే గౌరవం ఉంటుంది. పరాశ్రయం ఉంటుంది. ఇతరులపై దయ చూపిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  అన్ని పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు అధిక శ్రమపడాలి. పరిశోధకులకు కష్టకాలం. ఇతరులపై ఆధారపడతారు. దూరదృష్టి కొంత తగ్గుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు ఉండవు. సంతృప్తిలోపం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు వస్తాయి. పరామర్శలు చేస్తారు. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్తలు. విద్యార్థులకు కాస్త ఒత్తిడి సమయం. విష్ణు సహస్రనామ పారాయణ శుభఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. పరస్పర సహకారాలు లోపిస్తాయి. భాగస్వామ్య అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. గౌరవంకోసం ఎదురు చూపులు. విద్యార్థులకు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శత్రువులపై విజయం ఉంటుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడంలో ఉత్సాహం ఉంటుంది. పట్టుదలతో మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంతాన సమస్యలు అధికం అవుతాయి. సంతానం వల్ల ఒత్తిడి అధికం అవుతుంది. మానసిక చికాకులు ఏర్పడతాయి. చిత్తచాంచల్యం ఉంటుంది. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు కష్టకాలం. కళాకారులకు కష్టకాలం. లక్ష్మీ అష్టోత్తర పారాయణ మంచి ఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ