18 అక్టోబర్ 2018 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 18th oct2018 horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఉంటాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరచుకుటాంరు. కీర్తి ప్రతిష్టలపై కాంక్ష ఉంటుంది. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్యస్వామి పూజ ఉపకరిస్తాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన ఉంటుంది. పరిశోధనల వల్ల ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు కష్టకాలం. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. విశాలభావాలు ఉంటాయి.  అధికారులతో అననుకూలత ఏర్పడుతుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులుటాంయి. అనుకోని కష్టాలు వస్తాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. పదిమందిలో గౌరవంపెంచుకునే ప్రయత్నం. భాగస్వామ్య అనుబంధాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య భావన పెరుగుతుంది. జాగ్రత్త అవసరం. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శత్రువులపై విజయం ఉంటుంది. పోటీల్లో కష్టపడి గెలుపు సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల వల్ల విముక్తి కలుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన ఆలోచనల్లో అలజడి వస్తుంది. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. సృజనాత్మకతను కోల్పోతారు. కళాకారులకు అనుకూల సమయం. వంశపరంపరమైన ఆలోచనలు పెరుగుతాయి. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. బంధువులతో ఒత్తిడి. అనారోగ్య సమస్యలు ఉంటాయి.శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాల్లో సంతోషం లభిస్తుంది.   ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాక్‌చాతుర్యం పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కంటి సంబంధ దోషాలు ఉంటాయి. ఆలోచనల్లో అననుకూలత ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది. ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు చెందుతాయి. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ఒత్తిడి ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. శారీరక శ్రమ ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శుభకార్యాల్లో పాల్గొటాంరు. అన్ని రకాల ఆదాయాలు లభిస్తాయి. సంతృప్తి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శరీర సౌఖ్యం ఉంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆదాయం ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.  

డా.ఎస్ ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios