12 నవంబర్ 2019 మంగళవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సామాజిక అనుబంధాలు ఒత్తిడిని తీసుకొస్తాయి. నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల వైపు ఆలోచన ఉండరాదు. మోసపోయే అవకాశం. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. భాగస్వామ్య అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. పలుకుబడి తగ్గవచ్చు.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకోని ఆదాయాలు వస్తాయి. అవమానాలను ఎదుర్కొటాంరు. చెడు సహవాసం చేసే ప్రయత్నం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. క్రయ విక్రయాలు చేస్తారు. ఆకస్మిక లాభ నష్టాలు వచ్చే సూచనలు. దానధర్మాలు మేలు చేస్తాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సామాజిక అనుబంధాలు ఒత్తిడిని తీసుకొస్తాయి. నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల వైపు ఆలోచన ఉండరాదు. మోసపోయే అవకాశం. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. భాగస్వామ్య అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. పలుకుబడి తగ్గవచ్చు.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పోీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. ఋణ సంబంధ ఆలోచనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. స్త్రీలతో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతాన ఆలోచనలు ఫలిస్తాయి. సంతానం వలన సంతోషం కలుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. లలిత కళలపై దృష్టి పెరుగుతుంది. వంశపారంపర్య ఆలోచనలు వృద్ధి చేసుకునే అవకాశం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఆహారం వలన అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలపై దృష్టి పెంచుకుటాంరు. వాికోసం తాపత్రయ పడతారు. విద్యార్థులు తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. స్త్రీల ద్వారా అనుకూలతలు పెంచుకుటాంరు. విందు వినోదాల్లో పాల్గొటాంరు.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : స్త్రీల ద్వారా సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. రచనలపైదృష్టి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పరామర్శలు చేస్తారు. తోివారి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రకటనలపై దృష్టి పెడతారు.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మాటవిలువ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకునే ప్రయత్నం చేస్తారు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శారీరక సౌఖ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. అభిరుచులు మారుతూ ఉంాయి. ముఖ వర్చస్సు దేహకాంతి పెంచుకునే ప్రయత్నం చేస్తారు.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతి లభిస్తుంది. పనుల ఒత్తిడి తగ్గించు కుటాంరు. అనవసర ఖర్చులు చేస్తారు. సుఖంకోసం ఆలోచిస్తారు. దేహసౌఖ్యం లోపిస్తుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. విహార యాత్రలు చేయాలనే కోరిక పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. లాభాలు వచ్చినా సమయానికి ఉపయోగపడవు. ఇతరులపై ఆధారపడతారు. అన్ని రకాలాదాయాలు ఆనందాన్నివ్వవు. సమిష్టి ఆశయాలకై ప్రయత్నిస్తారు. దానధర్మాలు చేయడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. చేసే వృత్తుల్లో నైపుణ్యం పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారు. పెద్దలంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధకులకు అనుకూల సమయం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశం. విద్య నేర్చుకోవడం ద్వారా గౌరవం పెరుగుతుంది. సజ్జన సాంగత్యం చేస్తారు. దూరదృష్టి పెరుగుతుంది. సంతృప్తి లభిస్తుంది.
డా.ఎస్.ప్రతిభ