Asianet News TeluguAsianet News Telugu

21 జూన్ నుంచి 27 జూన్ వరకు వార ఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week horoscope is here
Author
Hyderabad, First Published Jun 21, 2019, 9:50 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : లాభాలపై దృష్టి ఉంటుంది. ప్రయోజనాపేక్షతో పని చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సోదరవర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. వార్తలు కొన్ని అయోమయానికి గురి చేయవచ్చు. గౌరవ లోపాలకు అవకాశం ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులు ఉంటా యి. సుదూర ప్రయాణాలకు అవకాశం ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొటా ంరు. వ్యతిరేక ప్రభావాలుంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వృత్తిపరమైన ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెడతారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. తండ్రి, పితృవర్గంవారి వ్యవహారాలు చర్చకు వస్తాయి. మ్లాడేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి. నిల్వధనం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్యాల్లో అన్ని రకాలుగా శుభ పరిణామాలు ఏర్పడతాయి. అనుబంధాలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలు ఏర్పడతాయి. సేవారంగంలో పని చేస్తే మేలు కలుగుతుంది. సంప్రదింపులకు అనుకూలమైన సమయం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. గుర్తింపు, గౌరవాదులు కూడా లభిస్తాయి. నిర్ణయాదుల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. సుదూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. దానధర్మాలు సంతృప్తినిస్తాయి. పోీరంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అనేక రకాల బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని ఇబ్బందులను ఎదుర్కొటా ంరు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. కొత్త నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యర్థమైన ఖర్చులు ప్రయాణాదులకు అవకాశం ఉంది. పరామర్శలకుకూడా అవకాశం ఏర్పడుతుంది. ఆలోచనలు కొన్ని ఫలించవచ్చు. గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. ఉన్నత విద్య ఉద్యోగాదులు సంతోషాన్ని సంతృప్తినిస్తాయి. వ్యతిరేకతలు ఇబ్బందే పెట్టే సూచనలు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : భాగస్వామ్యాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పరిచయాలు, పాత స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారాదుల్లోనూ అనుకూల ఏర్పడుతుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యారంగంలోని వారికి అభివృద్ధి అవసరం. నిర్ణయాదులను వాయిదావేయుట మంచిది. అనారోగ్య భావనలుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని ఊహించని సంఘటనలుంటాయి. ఆలోచనల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆలస్య నిర్ణయాలు. శ్రీమాత్రేనమః జపంమంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  పోీలు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలు ఉన్నా విజయం సాధిస్తారు. అన్ని పనుల్లో శ్రమ ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అధికమైన శ్రమ ఉంటుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. బాధ్యతలు అధికం అవుతాయి. పెద్దలతో సంప్రదింపులు ఉంటా యి. మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలుంటాయి. పాత అనుబంధాలను గుర్తు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైన జీవనం ఏర్పరచుకుంటారు. సంతానంతో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. కొత్త నిర్ణయాలకు అవకాశం కలుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ప్రయాణావకాశాలు ఉంటా యి. విద్యారంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. గృహ, వాహనాదులపై ప్రత్యేకదృష్టి ఏర్పడుతుంది. మౌలిక వసతుల ఏర్పాటు జరుగుతుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. సంతోషం వస్తుంది. అనుకోని సమస్యలు ఇబ్బంది పెడతాయి. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి ఏర్పడుతుంది. క్రియేటివిటీని పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలపై దృష్టి ఏర్పడుతుంది. కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. శ్రీమాత్రేనమమః జపం చేయడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంప్రదింపులు ఉంటా యి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవ్గంతో అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. ధార్మికమైన పెట్టుబడులు అవసరం. దానధర్మాలు సంతోషాన్నిస్తాయి. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. గృహ వాహనాదులపై దృష్టి పెడతారు. నిర్ణయాలలో ఆలస్యం ఏర్పడుతుంది. బద్ధకం తగ్గించుకోవాలి. వ్యాపారాదుల్లో జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపంమంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరచుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధువర్గంతో ఆనందంగా కాలం గడుపుతారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త వార్తలు వినిపిస్తాయి. సంప్రదింపుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సహకార లాభాలుంటాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిర్వహణ చేస్తారు. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. శ్రీమాత్రేనమః జపంమంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక రకాల బాధ్యతల నిర్వహణ చేస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి పెడతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనల్లో ఒత్తిడులు ఏర్పడతాయి. సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి పరమైన ఒత్తిడులు, శ్రమ అధికంగా ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. కుటుంబ బంధువర్గ బాధ్యతలు సంతోషాన్నిస్తాయి. ఆర్థిక నిల్వలపై ప్రత్యేక దృష్టి పెడతారు. లాభాల విషయుంలో జాగ్రత్త అవసరం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఖర్చులు అధికం. అనేక విషయాలకోసం పెట్టుబడులుంటాయి.విందు వినోదాలకు అవకాశం ఏర్పడుతుంది. సంతోషం కోసం సమయం వెచ్చిస్తారు. ప్రయాణాలకుఅవకాశం ఏర్పడుతుంది. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. సౌకర్యాలు శ్రమకుగురిచేయవచ్చు. ఉన్నత కార్యక్రమాల నిర్వహణ కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అకవాశం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం వస్తుంది. కార్యనిర్వహణ దక్షత పెంచుకుంటారు. కొత్త పనులపైదృష్టి పెడతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios