ఇలా చేస్తే... లక్ష్మీ దేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది..!

డబ్బు సంపాదించడం తెలిసినా.. చాలా మందికి డబ్బును ఎలా నిల్వ చేయాలో తెలీదు. ఇంట్లో డబ్బును ఆకర్షించడానికి ఒక చిన్న రెమిడీని ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఓసారి చూద్దాం...

This 5 grain pot remedy can attract wealth and financial stability ram

డబ్బు సంపాదిస్తున్నా...  పొదుపు చేయలేకపోతున్నారా?  ఈ సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది మీ సమస్య ఏంటి అంటే... తాము  డబ్బు చాలా కష్టపడి సంపాదిస్తున్నామని అయితే.. భవిష్యత్తు కోసం దానిని పొదుపు చేయడం కోసం ఎంతగానో కృషి చేసినా.. డబ్బు నిల్వ ఉండటం లేదని చాలా మంది వాపోతుంటారు. డబ్బు సంపాదించడం తెలిసినా.. చాలా మందికి డబ్బును ఎలా నిల్వ చేయాలో తెలీదు. ఇంట్లో డబ్బును ఆకర్షించడానికి ఒక చిన్న రెమిడీని ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఓసారి చూద్దాం...

ఒక మట్టి కుండతో డబ్బును సులభంగా ఆకర్షించవచ్చట. అదెలాగో... ఓ ప్రముఖ జోతిష్కుడు ఏం చెప్పాడో ఓసారి చూద్దాం...
 ఒక చిన్న మట్టి కుండ  తీసుకొని.. అందులో 5 నాణేలు ఉంచాలి. ఆ తర్వాత... ఆ మట్టికుండలో ఐదు రకాల ధాన్యాలు కొద్దికొద్దిగా వేసి దానిని నింపాలి. ఐదు రకాల ధాన్యాలు అంటే బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ ఇలా ఏదైనా ఐదు ధాన్యాలతో దానిని నింపాలి. అనంతరం దానిని ఒక ఎరుపు రంగు గుడ్డతో మూసివేసి.. ఎర్ర దారంతో కట్టేయాలి. ఇప్పుడు ఈ మట్టి కుండను.. మీ పూజ మందిరంలో 24 గంటలు ఉంచాలి. అంతే... ఇది మీ ఇంట్లో డబ్బును ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు... 24 గంటల తర్వాత పూజ మందిరంలో నుంచి మట్టి కుండను తీసి... మీరు నగదు, బంగారం దాచి ఉంచే లాకర్ లో ఉంచాలి. 

 

మట్టి కుండ,  గింజలే ఎందుకు?
మట్టి కుండే ఎందుకు ఉపయోగించాలి అనే సందేహం ఉండొచ్చు, దానికి కారణం ఉంది. మట్టి కుండ భూమిని సూచిస్తుంది, ఇది వస్తువులను దాని వైపుకు లాగగల గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. కుండకు కూడా వర్తిస్తుంది. అంతే కాకుండా, ప్రధానమైన పదార్థాలు, ధాన్యాలు పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఇంట్లో ప్రవృత్తిని తెస్తాయని నమ్ముతారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ రెమిడీని ఆచరించి... డబ్బు సమస్యలను పరిష్కరించుకోండి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios