ప్రాణాయామంలో ఎన్నో రకాలు ఉన్నా అందరికీ వీలయ్యేవి ఋతువులకు అనుగుణంగా ఉన్నవి కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి.

ప్లానివి : ఈ ప్రాణాయామం వలన పొట్టలోని వ్యాధులు నయమవుతాయి. పొట్టలోని క్రిములు నశిస్తాయి. జఠరాగ్ని తీవ్రమవుతుంది. హిస్టీరియా వ్యాధి తగ్గుతుంది. నిరంతర అభ్యాసం వలన భోజనం లేకుండా ఎన్నో రోజులు ఉండగలరు.

అగ్నిసార : జీర్ణవ్యవస్థలోని అంగాలన్నీ చక్కగా మాలిష్‌ అయి, బాగా పని చేయటం వలన జఠరాగ్ని పెరుగుతుంది. బాన పొట్ట తగ్గుతుంది. మలబద్ధకం దూర మవుతుంది. సమాన ప్రాణం పైన ప్రభావం పడటం వలన ఆహారంలోని రసం రావానికీ, శరీరమంతా అది అందానికీ చక్కగా దోహదపడుతుంది. అపాన వాయువు కూడా ప్రభావానికి లోనవటం వలన విసర్జక క్రియ సక్రమంగా జరుగుతుంది.

 కపాలభాతి : సాధారణశ్వాస వలన బైటకు పోలేని ఊపిరితిత్తులలోని వాయువు కూడా బైటపడుతుంది. దాని స్థానంలో ప్రాణవాయువు లోపలికి ప్రవేశించి రక్తాన్ని శుద్ధిపరచే క్రియను మరింత తీవ్రం చేస్తుంది. రక్తప్రసరణ కూడా సామాన్యంగా జరుగుతుంది.

శ్వాసవ్యవస్థ, నాసికాద్వారాలు శుభ్రపడి మృదువుగా తయారౌతాయి. వీటి  ఫలితంగా సంపూర్ణ శ్వాసవ్యవస్థ సరిగా పనిచేస్తుంది.

మూలబంధం వేసి ఈ క్రియను పదే పదే ఆచరించటం వలన మూలాధార, స్వాధిష్టాన, మణిపూరచక్రాలూ మూడూ ప్రభావితమవుతాయి. శ్వాసను బైటకు వదలటంలో అనాహత చక్రం, చివర చేసే ఆంతరంగిక కుంభంలో మూడు భేదాలను అభ్యసించటం వలన విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రాలు మూడు కూడా ప్రభావానికి లోనవుతాయి. ఈ విధంగా ఏడు చక్రాలూ ఈ క్రియ వలన ప్రభావితమవుతాయి. ఈ ప్రాణ ప్రసారణ కేంద్రాల నుండి శరీర మంతికీ ప్రాణం సమానంగా ప్రసరించానికి ఈ క్రియ తోడ్పడుతుంది. ఆలోచనాశక్తి, స్ఫురణశక్తి అద్భుతంగా పెరుగుతాయి.

బాహ్య కుంభకంలో మూడు బంధాలను అభ్యాసం చివర వేయటం వలన నాభినుండి ప్రాణ, అపాన వాయువులను రెండింనీ మస్తిష్కం వైపు తీసుకుని పోవటంలో ఈ క్రియ సహాయ పడుతుంది. ఉద్వేగాలు తగ్గి మనసు శాంతిస్తుంది.

అగ్నిసార, కపాలభాతి ఈ రెండు ప్రాణాయామాలు వాయుతత్వ రాశులు అనగా మిథున, తుల, మకర రాశులవారు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎందువలనంటే వీరికి అపానవాయువు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శరీరంలో గాలి తొందరగా చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని థ అంతర్దశలు, గోచారంలో శని సంచరించే స్థానాలు అష్టకవర్గులో బిందువులు తక్కువగా ఉన్నవారు ఈ ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి. వారికి గాలి పీల్చి వదలడానికి కూడా బద్ధకంగానే ఉంటుంది. ఇవి కూడా ఇంట్లో చేయరాదు. యోగాభ్యాసకుల దగ్గరకు వెళ్ళి చేస్తేనే ఫలితం ఉంటుంది.

సూర్యభేది : కంఠం, జిహ్వ, స్వరాల దోషాలు బాగుపడతాయి. విశుద్ధి, ఆజ్ఞా చక్రాలపై దీని ప్రభావం ఎక్కువ. శరీరంలో వేడి పుడుతుంది. వాత కఫ సంబంధాలైన అనేక రోగాలు దూరమౌతాయి. రక్తదోషం, చర్మదోషం, పొట్టలో పురుగులు పోతాయి. జఠరాగ్ని తీవ్ర మవుతుంది. కుండలినీ శక్తి జాగృతం చేస్తుంది. లో.బి.పి. వాళ్ళకు హితకారి. మస్తిష్క శోధనం కూడా జరుగుతుంది.

జలతత్త్వరాశులు అనగా కర్కాటక, వృశ్చిక, మీన రాశులవారు ఈ ప్రాణాయామం చేయాలి. ఎందుకంటే వారి శరీరంలో ఉష్ణం తక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారు శీతల వర్షాకాలాలలో ఈ ప్రాణాయామం చేయడం వలన వీరి శరీరంలో తొందరగా ఉష్ణశక్తి పెరుగుతుంది. ఈ రాశుల వారికి జీర్ణశక్తి కూడా వేగంగా పనిచేయదు. ఎందువలనంటే అగ్నితత్వం తక్కువగా ఉంటుంది కాబ్టి వేడి ప్టుటి ంచే  ప్రాణాయామాలు ఎక్కువగా చేసుకోవాలి.

5. భస్త్రిక : వాత, పిత్త, కఫాలకు సంబంధించిన దోషాలు పోతాయి. ఉబ్బసం, దగ్గు, ఛాతీలో మంట మొ||నవి తగ్గుతాయి. గొంతు వాపు, మందాగ్ని తగ్గుతాయి. రక్తశోధన క్రియ వేగంగా జరిగి రక్త ప్రసరణ కూడా త్వరితం అవుతుంది.

డా.ఎస్.ప్రతిభ