Asianet News TeluguAsianet News Telugu

రవి కన్య రాశిలో సంచారం... ఇతర రాశులపై ప్రభావం..?

రవి కన్యా రాశిలో ఉన్న మొదటి 15 రోజులు మహాలయం, తరువాత 15 రోజులు దేవీ నవరాత్రులు. శుభకార్యాలు ఇంట్లో పూజలు, నోములు లాది అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. 18.10.2019న రవి కన్య రాశి నుంచి తులరాశిలోకి ప్రవేశిస్తాడు.

the story of kanya rashi
Author
Hyderabad, First Published Sep 19, 2019, 10:29 AM IST

రవి కన్యారాశిలలోకి18 సెప్టెంబరున మార్పు చెందాడు. ఈ రాశి రవికి శత్రుక్షేత్రం. రవి కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలోనే చంద్రుడు కూడా మీనరాశిలో ఉంటాడు. ఈ సమయంలోనే మనకు మహాలయ పక్షాలు మొదలౌతాయి. మళ్ళీ చంద్రుడు కన్యరాశిలోకి వచ్చే పదిహేను రోజులు కూడా శుభకార్యాలు చేయరు. అమావాస్య దాదిన తరువాత పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. రవి కన్యా రాశిలో ఉన్న మొదటి 15 రోజులు మహాలయం, తరువాత 15 రోజులు దేవీ నవరాత్రులు. శుభకార్యాలు ఇంట్లో పూజలు, నోములు లాది అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. 18.10.2019న రవి కన్య రాశి నుంచి తులరాశిలోకి ప్రవేశిస్తాడు.

మేషం : శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనలు తీరుతాయి.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని ప్రదేశాల్లో విజయం సాధిస్తారు. కొంత అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. అహంకారం వల్ల అందరూ దూరమౌతారు. జాగ్రత్తగా ఉండాలి. సూర్యపారాయణ చేయడం మంచిది.

వృషభం : వీరు ఏ విషయంలో కూడా స్ట్రెస్‌ తీసుకోకూడదు. ఎక్కువగా ఆలోచించకూడదు. సంతానంకోసం ఆలోచన అధికమౌతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. ఆలోచనల్లో అలజడి పెరుగుతుంది. ఏవో భయాలు మనసులో ఆందోళనకు గురిచేస్తాయి. ప్రశాంతంగా నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి. సూర్యపారాయణ చేయడం మంచిది.

మిథునం : తమకు లేని విషయంపై దృష్టి పెడతారు. అవి సమయానికి అందకపోవచ్చు. ఆహారం సమయానికి అందకపోవచ్చు.  మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. గౌరవహాని జరగవచ్చు. గౌరవాదులకోసం ఎక్కువ ప్రాకులాడకూడదు. తమకు గౌరవం లేని చోట పక్కకు జరగడం మంచిది. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

కర్కాటకం : కమ్యూనికేషన్స్‌ బాగా విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అన్ని పనుల్లో సంతోషం ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడి విజయం సాధిస్తారు. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

సింహం : మాటల్లో కఠినత్వం ఉంటుంది. మ్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధాల వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు. ఆత్మీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక నిల్వల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకూడదు. ఎక్కువగా మౌనంగా ఉండడంమంచిది.

కన్య : మొది పదిహేను రోజులు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. తరువాత పదిహేను ఆనందంతో తమకు అవసరం లేని పనులు అన్నీ ఈ సమయంలో వచ్చి పడతాయి. ఒకేసారి పది పనులు చేయాల్సి వస్తుంది. తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు అయితే వేరే ప్రదేశాలకు టాన్ఫర్స్‌ అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సూర్యారాధనమేలు.

తుల : విశ్రాంతికై ప్రయతిస్తారు. విశ్రాంతి తొందరగా లభించదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.  వైద్యశాలల సందర్శనం ఉంటుంది. రాత్రిళ్ళు నిద్ర తక్కువగా ఉంటుంది. ఆలోచనలు, ఆవేశాలు పెరుగుతాయి. అన్ని పనులు ఒత్తిడితో పూర్తి చేస్తారు. దానాలు చేయడం మంచిది. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

వృశ్చికం : అధికారిక లాభాలు ఉంటాయి. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. పెద్దలు, అధికారుల అండ దండలు పెరుగుతాయి. వారి సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

ధనుస్సు : సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో నైపుణ్యం పెరుగుతుంది.  అధికారుల ఆదరణ తక్కువౌతుంది. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. హోదా గౌరవం పెరిగిన దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. దాని వల్ల స్ట్రెస్‌ పెరుగుతుంది. ఆలోచనలు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.

మకరం : సంతృప్తి లోపం పెరుగుతుంది. ఏ పనులు వేగవంతంగా పూర్తి చేయలేరు.పనుల ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అధికారిక ప్రయాణాలు ఆచి, తూచి చేయాల్సి ఉంటుంది. సూర్యపారాయణ చేయడం మంచిది.

కుంభం : అనారోగ్య సమస్యలుఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అధికారులతో అప్రమత్తత అవసరం. అవనసవర ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనం వృథా అవుతుంది. ఏ పని చేసినా ఒకికి రెండుసార్లు ఆలోచించి మరీ చేయండి. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

మీనం :  సామాజిక అనుబంధాలు శ్రమతో సాధించాలి. సామాజిక ఒత్తిడి అధికమౌతుంది. భాగస్వామిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకూడదు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది. వీరు ప్రతి నిత్యం సూర్యపారాయణ చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios