శివ స్వరూపంగా బిల్వ వృక్షం భావించబడుతున్నది. మొత్తం చతుర్దశ భువనాల్లోనూ పుణ్యక్షేత్రాలకు బిల్వవృక్షం సూచిక అంటారు. దీని మూలం (వేర్లు) గంధపుష్పార్చితం చేసేవారికి వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ వృక్షం చుట్టూదీపారాధన శివజ్ఞానదాయిని. ఇంత విశేష మహిమ గల ఈ మారేడు చెట్టు నీడన, ఒక్కరికి అన్నం పెట్టినాకోటిమందికి అన్నదానం  చేసిన ఫలితం. దీని క్రింద ఒక శివభక్తునికి క్షీరాన్నం ఘృతసహితంగా సమర్పిస్తే అట్టివాడికి జన్మాంతరాలయందు కూడా అన్నదారిద్య్రం ఉండదు. కనుక ప్రతీ ఒక్కరూ బిల్వ వృక్షాలను నాలి. ఈ బిల్వ దళంలో తేనె వేసి శ్రీ సూక్త హోమం చేస్తే దారిద్య్రం కూడా నశిస్తుంది.

సోమవారం శివప్రీతికరం : లోకరీతి ప్రకారం సోమవారం, శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావించబడుతున్నది. శంకరుడు అగ్నిని తన స్వరూపంగా కలిగిన లక్షణయుతుడు. (త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రా... అని రుద్ర సూక్తం) ఈ వేడిమిని చల్లబరచగలిగేది సోముడు (చంద్రుడు), జ్యోతిషరీత్యా కృత్తికాగ్నిర్దేవతా అని శ్రుతి. అగ్ని నక్షత్రం కృత్తిక. కృత్తికా నక్షత్రం చంద్ర కళలన్నీ ఉండే పూర్ణిమనాడు ఉండటం ఏ మాసంలో సంభవిస్తుందో అదే కార్తీకం. కనుకనే కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది. అంతరార్థం ప్రకారం (స+ఉమ=సోమ) ఉమాసహితంగా ఉండేరోజు కనుక సోమవారం శివ ప్రీతికరం.

భస్మధారణ-ఫలం : భస్మం ద్వివిధాలుగా ఉంటుంది. 1. స్వల్పభస్మం, 2. మహాభస్మం. వీటి వల్లనే శ్రౌత, స్మార్త - లౌకికాలనే మూడు విభూతులు ఉత్పన్నమయ్యాయి.

విభూతిని శివనామస్మరణంతోనూ; మంత్రపూర్వకంగానూ ధరించవచ్చు.

త్రిపుండ్రాలుగా ధరించబడే ఈ విభూతిలో ముఖ్యద్రవ్యం - కాల్చబడిన గోమయం. వితంతుస్త్రీలు పంచాక్షరీ జపంతో భస్మధారణ చేయాలి. సత్యశాంభవ దీక్షాయుతులు మాత్రం ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మధారణతో ఉండాలి.

భస్మధారణ లేకుండా చేసే ఏ పూజలైనా, నిష్ఫలాలని చెప్తుంటారు. 32 స్థానాలు భస్మధారణానుకూలం. సాధారణంగా 16 చోట్ల భస్మం ధరించేవారున్నారు.

గృహస్థులు మాత్రం, తల, బాహుద్వయం, హృదయం, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మధారణ చేస్తే చాలు !

నీచులనుండి దానం పరిగ్రహించడం కూడా పాపమే! ఇి్ట పాపాన్ని పోగొట్టగలది భస్మధారణ.

ఇంకా.. స్త్రీ హత్య. గోవధ, పరస్త్రీగమనం, అకారణహింస, పంటదొంగలించుట, గృహదహనాది సమస్త ఘోరపాపాలకు భస్మధారణ తక్షణ నివృత్తి సాధకమని శివ తత్త్వజ్ఞులు చెప్తారు.

నియమంగా భస్మధారణ చేయడం, శివోపాసన చేయడం దేవతలకు సంప్రీతికరం కనుక అి్టవాడు దైవకృపకు తప్పక పాత్రుడు కాగలడు.

శివునికి 26 రకాల ద్రవ్యాలతో అభిషేకం. అవి ఇచ్చే ఫలితాలు :  శివాభిషేకం అంటే చాలు అందరికీ సాధ్యమయ్యే ప్రక్రియే. అంతేకాద అన్నింకీ సర్వరోగనివారిణి, సర్వకార్య ఫలప్రదాయినిగా ప్రసిద్ధి. ఎవ్వరికీ ఏ కష్టమొచ్చినా చేయంచుకోవాల్సింది శివాభిషేకమే. అటువిం శివాభిషేకంలో ఆయా కామ్యాలను తీర్చుకోవడానికి ఆయా పదార్థాలను వాడాలని శాస్త్రవచనం. ఏ పదార్థం వాడితే ఏం ఫలమో తెలుసుకుందాం.

పదార్థాలు ఫలితం శుభ్రమైన నీరు శివానుగ్రహం, ఆవుపాలు సర్వసౌఖ్యం, ఆవు పెరుగు ఆరోగ్యం, బలం, యశస్సు, ఆవు నెయ్యి ఐశ్వర్యవృద్ధి, తేనె తేజోవృద్ధి, చెరుకురసం ధనవృద్ధి, మెత్తని పంచదార దుఃఖనాశనం, ద్రాక్షపంబ్ల రసం కార్యజపం, జ్ఞానప్రాప్తి, మామిడిపండ్ల రసం దీర్ఘవ్యాధి నాశనం, నేరేడు పండ్ల రసం వైరాగ్యం, ఖర్జూరరస జలం సకల కార్యజయం, కొబ్బరినీళ్ళు సర్వసంపద వృద్ధి, భస్మజలం మహాపాపహరం, బిల్వదళోదకం భోగభాగ్యాలు, దూర్వోదకం నష్టద్రవ్యప్రాప్తి, రుద్రాక్షోదకం మహాదైశ్వర్యం, పుష్పోదకం భూలాభం, సువర్ణోదకం దారిద్య్రనాశనం, నవరత్నోదకం ధాన్యం, గృహం హరిద్రోదకం సౌభాగ్యం, మంగళప్రదం, సుగంధోదకం (పన్నీరు) పుత్రలాభం నువ్వుల నూనె అపమృత్యు భయ నివారణం. తిలమిశ్రిత ఆవుపాలు శనిగ్రహపీడా నివారణ. శర్కర మిళిత ఆవుపాలు జడబుద్ధి నివృత్తి, వాక్‌శ్శుద్ది, వాక్సిద్ధి, దక్షిణావృత శంఖోదక జలం కస్తూరీజలాలు గృహకల్లోలాలు తొలుగును, చక్రవర్తిత్వం లభించును.