Asianet News Telugu

నేడు ఏరువాక పౌర్ణమి.. ఏంటి ప్రత్యేకత?

వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తూన్న ఆచారం.

special stoty of eruvaka pournima
Author
Hyderabad, First Published Jun 17, 2019, 3:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం భారతీయుల సంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తూఉంటాం.  వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తూన్న ఆచారం.

పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని 'ఏరువాక' అని అంారు. జ్యేష్శ శుద్ధ పూర్ణిమను ఏరువాక పూర్ణిమ అని కూడా వ్యవహరిస్తారు. ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకనే జ్యేష్ఠ పూర్ణిమనాడు మొదిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్సము అని జరుపుకుంటారు.

వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీనకాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తున్నారు. అధర్వవేదం ఏరువాకను 'అనడుత్సవంగా చెప్పింది. క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తర్వాతి కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు.

విష్ణుపురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. సీత అంటే నాగలి అని అర్థం. ''వప్ప మంగళ దివసం..'' బీజవాపన మంగళ దివసం...'' ''వాహణ పుణ్ణాహ మంగళమ్‌...'' ''కర్షణ పుణ్యాహ మంగళమ్‌...'' అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు. శుద్ధోదనమహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఐతిహ్యం. గాథాసప్తశతిలో ఏరువాకను గురించిన గాథలున్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్యధారాలున్న 2000 సంవత్సరాల అతి ప్రాచీన పండుగ. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాదరించినట్టు తెలుస్తుంది.

పండుగ ఆచరణ :

ప్రతి ఏా ఏరువాక పూర్ణిమను జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు పండుగ జరుపుకుంటారు. వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. అవి లేకుండా ఏ పని జరుగదు. అందుకే ఎద్దులను దైవంగా భావించి పూజిస్తారు. ఆ రోజు ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు అందమైన రంగులు పూసి, మెడలో కొత్త గంటలు, రంగుల పూసలు, పూలతో నిండిన దిష్టి తాళ్ళు క్టి అలంకరిస్తారు. వాటి కాళ్ళకు ఘల్లుఘల్లు గజ్జెలు కడతారు. నాగలిని - కాడికి కూడా రంగులు పూస్తారు. పశువులను కట్టె స్థలాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేసి, ధూపదీపనైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా పొంగలి వండి ఎద్దులకు తినిపిస్తారు. ఆ రోజు సాయంత్రం రైతులు నాగలిని భుజం మీద పెట్టుకుని ఎద్దులను తోలుకొని పొలాల వద్దకు వెళ్ళి అక్కడ భూమిని పూజించడం, దున్నడం ప్రారంభిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తప్పెట్లతో మేళతాళాలతో ఎద్దుల్ని ఊరేగిస్తూ రైతులు పొలానికి చేరుకుంటారు.

అక్కడ గోగునారతో చేసిన తోరణాన్ని పొడవుగా కడతారు. ఆ తోరణాన్ని ఆ ఊళ్ళో ఉన్న కర్ణకులందరూ చర్నాకోలతో క్టొటి పీచుపీచుగా చేస్తారు. ఆ పీచును ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకుపోయి ఎద్దుల మెడలకీ.... నాగళ్ళకి కడతారు. కొంత ఇళ్ళల్లో భక్తిగా దాచుకుంటారు. ఆ విధంగా చేస్తే తమ పశువులకు మంచి జరుగుతుందని నమ్ముతారు. తరువాత తమ కుటుంబ సభ్యులతో కలిసి పిండివంటలతో విందు భోజనాన్ని ఆనందంగా ఆరగిస్తారు కర్షకులు.

చల్లిన ప్రతిగింజా కోటిమొక్కలై వర్ధిల్లాలని.... పాడిపంటలతో తమ ముంగిళ్ళు మురిసిపోవాలని.. అందరూ చల్లగా ఉండాలని నిండు మనస్సుతో ఏరువాకమ్మని కోరుకుంటారు. దుక్కి గల భూమి, దిక్కుగల మనిషీ ఎన్నికి చెడడు అని కర్షకులు గ్టిగా నమ్మతారు. ఆ రోజు ఎంతఅవసరమొచ్చినా ఎవరికి అప్పు ఇవ్వరు. వర్షాకాల ప్రారంభ సమయంలో వ్యవసాయ ప్రారంభానికి ముందు భూమి పూజ, ఎడ్ల పూజచేసి నాగలితోపాటు మొదిగా భూమిని దున్నే పండుగను కర్షకులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

నిత్యపరిశీలన వల్ల జానపదులకు జ్యోతిష సంబంధమైన విజ్ఞానం అవగాహన అధికంగా ఏర్పడింది. జానపద సాహిత్యంలోనూ జానపద విజ్ఞానంలోనూ జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించిన ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి చెందిన జానపదుడు కార్తెలకు సంబంధించిన విజ్ఞానంతో అనుకూలమైన సమయం కోసం ఎదురు చూసేవారు. దానికి అనుగుణంగానే ఏ సమయంలో ఏ పంటలు వేస్తే, ఏ కాలంలో బాగా పండుతాయో ఆ సమయంలో విత్తనాలు జల్లి పొలం పనులు ప్రారంభిస్తారు. పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని సిరిధాన్యాలతో ఇల్లు నిండాలని ఈ నేల సస్యశ్యామలం కావాలని కోరుకుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios