షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్ శ్రీ మాత్రేనమః అనే జపాన్ని అన్ని రాశుల వారు నిరంతరం పారాయణ చేయండి.
10.9.2019 నుంచి 3.10.2019 వరకు శుక్రుడు కన్యారాశిలో సంచారం. శారీరక శ్రమకు తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. ఏ పనినైనా మొండితనంతో సాధించాలనే ప్రయత్నం చేస్తారు. దానివలన వీరే నష్టపోతారు. ఎదుివారు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విని ఆలోచించాలి.
షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్ జగన్నీరోగ శోభనమ్ శ్రీ మాత్రేనమః అనే జపాన్ని అన్ని రాశుల వారు నిరంతరం పారాయణ చేయండి.
మేషం : కళాకారులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. మొండితనంతో పనులు పూర్తి చేస్తారు. కడుపు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అనవసర విషయాల జోలికి పోకూడదు. వైవాహిక జీవన సంబంధాల్లో జాగ్రత్తగా మెలగడం మంచిది.
వృషభం : సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత పెంచుకునే ప్రయత్నం. బంధువుల దర్శనం జరిగే సూచనలు. క్రియేటివిటీ తో ఎదుివారిని నమ్మించి తమ పనులు పూర్తి చేయించుకుటాంరు.
మిథునం : విలాసవంతమైన జీవితం కోసం ఆరాట పడతారు. గృహ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. స్త్రీల ద్వారా సౌకర్యాలు ఏర్పడతాయి. విద్యార్థులకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధించే సమయం. అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతాయి. వాహనం ద్వారా అనుకూలత ఏర్పడుతుంది.
కర్కాటకం : విద్యార్థులు తక్కువ శ్రమతో లాభాన్ని సంపాదిస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. ప్రదర్శనలు బాగా రాణిస్తాయి. ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రచయితలకు అనుకూల సమయం.
సింహం. వాక్ చాతుర్యం పెరుగుతుంది. ఎదుివారిని ఆకరించే విధంగా మాట తీరు ఉంటుంది. కుటుంబ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. నిల్వ ధనంపై దృష్టి పెడతారు. బంగారం వెండి ఆభరణాల కొనుగోలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది.
కన్య : శారీరక సౌఖ్యం లభిస్తుంది. అనుకున్న పనులు ప్రణాళికా బద్ధంగా పూర్తి చేస్తారు. పనుల్లో వేగం, దానితోపాటు నైపుణ్యం కలిగి పనులు చేస్తారు. సమాజంలో గౌరవం కోసం ప్రాకులాడుతారు.
తుల : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. విశ్రాంతి లభిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. విలాసాలపై దృష్టి పెరుగుతుంది. గృహోపకరణ అలంకరణ వస్తువులు కొనుక్కోవాలనే ఆలోచన పెరుగుతుంది. అలంకరణలపై, వాహన సౌకర్యాలపై ఆలోచన.
వృశ్చికం : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. స్త్రీల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుటు ప్టోలనే ఆలోచన పెరుగుతుంది. అనుకోని ఆనందం లభిస్తుంది.
ధనుస్సు : అధికారులతో అనుకూలత పెరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. లాభాలు గౌరవాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు. పోీల్లో గెలుపు కోసం శ్రమ అధికం అవుతుంది. ఒత్తిడి తీవ్రస్థాయిలో పెరుగుతుంది.
మకరం : అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. గుర్తింపు వచ్చింది కదా అని తొందరపాటు పనికిరాదు. సంఘంలో గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమాచారాన్ని చేరవేయడంలో తొందరపాటు పనికిరాదు.
కుంభం : పూర్వ పుణ్యం తగ్గుతుంది. ఆకస్మిక ఇబ్బందులు వస్తాయి. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. క్రియేటివిటీ ని బాగా ఉపయోగించి పనులు చేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించదు. కొంత సంతానం కోసం ఆలోచన చేస్తారు.
మీనం : సామాజిక అనుబంధాలు వృద్ధి చెందుతాయి. తమ శ్రమకన్నా అధికశాతం గుర్తింపు లభిస్తుంది. తెలియని రోగాలు వెటాండుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం. గుర్తింపు లభిస్తుంది కదా అని తొందరపాటు పనికి రాదు.
