1. నూర్‌ జహాన్‌

భవిష్యత్తు ఎలా ఉంది?

ప్రస్తుతం అనుకూలంగానే ఉన్నది. ఈ సంవత్సరాంతం వరకు. డిసంబర్‌ 2020 నుంచి అన్ని పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీకు అవసరం లేని విషయాలు మీ తలపై నెట్టివేయబడతాయి. జాగ్రత్తగా ఉండాలి. కొంత మీరు బద్ధకాన్ని తగ్గించుకోవాలి.

ప్రతిరోజూ తప్పనిసరిగా యోగా ప్రాణాయామాలు కాని, వాకింగ్‌కాని జీవితంలో భాగంగా అలవాటు చేసుకోవాలి.     నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. చేసే పనుల్లో పోస్టుపోన్మెంట్ పనికిరాదు.

ఏదైనా దైవ ధ్యానం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానం : నూనె/ పల్లీలు, 2. పశువులకు, పకక్షులకు ఆహారం, 3.పళ్ళు/ పేదవిద్యార్థులకు పుస్తకాలు, 4. కూరగాయలు, ఆకుకూరలు/, 5. అలంకరణ వస్తువులు/ పులిహోర తప్పనిసరిగా దానం చేయాలి. దానాలు ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత ఎదుగుదల కనిపిస్తుంది.

2. శివకుమార్‌

ప్రస్తుతం ఎలా ఉంది?

మీకు సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఎప్పికీ తప్పదు. భాగస్వాములతో అనుకూలత అంత ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాల్లో జాతకంలో లోపం కనిపిస్తుంది. సెప్టెంబర్‌ 2019 తర్వాత అన్ని పనుల్లో ఆలస్యం మొదలౌతుంది. అందరితో, అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాల్సిన బాద్యత మీదే. కొంత మీరు బద్ధకాన్ని తగ్గించుకోవాలి. మొండితనం తగ్గించుకోవాలి. ఎదుివారిని గౌరవించాలి. వారి మాటలకు, వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రతిరోజూ తప్పనిసరిగా యోగా ప్రాణాయామాలు కాని, వాకింగ్‌కాని జీవితంలో భాగంగా అలవాటు చేసుకోవాలి.     నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. చేసే పనుల్లో పోస్టుపోన్మెంట్ పనికిరాదు.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ

దానం : 1. పశుపక్షాదులకు ఆహారం, / 2. గోధుమపిండి / చపాతీలు, 3. కందిపప్పు/ దానిమ్మపళ్ళు, 4. కూరగాయలు / ఆకుకూరలు; 5. నూనె / పల్లీలు దానం చేయాలి.

3. సౌమ్య

భవిష్యత్తు ఎలా ఉంది? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది

స్రస్తుతం కొంత ఒత్తిడి సమయం. ఏదైనా ఉద్యోగం వచ్చినా అందులో ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. 2020 జనవరి తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ప్రభుత్వసంస్థల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేసుకోగలరు.

నిరంతరం జపం, దానాలు తప్పనిసరిగా చేయాలి. జాతకంలో ఆలస్య వివాహం సూచిస్తుంది. తొందరపడకూడదు. ఈలోగా జపాలు, దానాలు చేసుకుంటూ వివాహం అయిన తరువాత వైవాహిక జీవితం అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకోండి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామ రామ; శ్రీ రాజమాతంగ్యై నమః

దానం : అన్నదానం / పాలు / పెరుగు 2. గోధుమపిండి/ చపాతీలు/ గోధుమ రవ్వ దానం చేయడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ